నాలుగేండ్లలో 5 వేల యాక్సిడెంట్లు

ఔటర్‌‌‌‌పై జరిగిన ప్రమాదాలు

ప్రాణాలు తీస్తున్న డిజైనింగ్ లోపాలు, ఓవర్​స్పీడ్

సీఆర్​ఆర్​ఐ సూచనలు అమలు చేయని హెచ్​ఎండీఏ

కోఆర్డినేషన్ లేని పోలీసులు, హెచ్​ఎండీఏ

డిజైనింగ్ స్టడీ చేయాలంటున్న ఎక్స్​పర్ట్స్

ఔటర్ పై డిజైనింగ్ లోపాలు, ఓవర్ స్పీడ్ ప్రాణాలు తీస్తున్నాయి. గత నాలుగేండ్లలో ఓఆర్​ఆర్​పై 5వేల యాక్సిడెంట్లు జరిగాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ శాతం ప్రమాదాలకు ఓవర్​స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణమని హెచ్​ఎండీఏ చెప్తోంది. అయితే 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ లో పలు చోట్ల ఉన్న డిజైనింగ్ లోపాలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఇంజనీరింగ్ ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు.

హైదరాబాద్, వెలుగు: జిల్లాల మధ్య ట్రాన్స్ పోర్టు ఫెసిలిటీ మెరుగుపరచడం, సిటీలో ట్రాఫిక్ తగ్గించడం కోసం 2008లో ఏడు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఔటర్​రింగ్​రోడ్డు నిర్మించారు. స్టార్టింగ్ నుంచి ఈ రోడ్డుపై తరచూ ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. అయితే నాలుగేళ్లుగా ప్రమాదాల సంఖ్య తగ్గుతున్నట్లుగా హెచ్ఎండీఏ వర్గాలు చెబుతున్నా… ఇదే టైమ్​లో ఔటర్​పై 5వేలకు పైగా యాక్సిడెంట్లు జరగడం గమనార్హం. ఈ ప్రమాదాల్లో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్​తో వెళ్లేలా ఓఆర్ఆర్ నిర్మించారు. వెహికల్స్ అంతకు మించి స్పీడ్​గా పోవడవ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఓఆర్​ఆర్​పై ఓవర్ స్పీడ్ కంట్రోల్​కు హెచ్ ఎండీఏ పటిష్ట చర్యలు చేటపట్టడం లేదు. స్పీడ్ ను  120 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించినా వాహనదారులు దాన్ని ఫాలో అవుతున్నారా లేదా అని పర్యవేక్షించడం లేదు.

సీఆర్ఆర్ఐ చెప్పినవి అమలు చేస్తలేరు

ఔటర్ లో యాక్సిడెంట్లపై 2016లో సెంట్రల్ రోడ్డు రీసెర్చీ ఇన్​స్టిట్యూట్​(సీఆర్​ఆర్​ఐ) స్టడీ చేసి కొన్ని సూచనలు చేసింది. ఇందులో స్పీడ్ కంట్రోల్ తప్పనిసరి అని చెప్పింది. చాలా చోట్ల సైన్ బోర్డులు సరిగ్గా లేవని గుర్తించింది. ప్రమాదకరంగా ఉండే కర్వ్, టర్నింగ్​ల వద్ద మెటల్ క్రాష్ బారికేడ్లతో, రబ్బర్ స్టడ్స్ ఏర్పాటు చేయాలంది. ఇక ప్రతి 25 కిలోమీటర్లకు ఒక పెట్రోలింగ్ వెహికిల్ ఉండాలని, రిఫ్లెక్టివ్‌‌‌‌ స్టిక్కరింగ్ చేయడంతోపాటు సేఫ్టీ ఇన్ ఫ్రా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నాలుగేండ్లుగా సీఆర్ఆర్ఐ చేసిన సూచనలు హెచ్ఎండీఏ అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతోంది.

ట్రాఫిక్, హెచ్​ఎండీఏల మధ్య కోఆర్డినేషన్ లోపం..

ట్రాఫిక్, హెచ్ఎండీఏల మధ్య కోఆర్డినేషన్​ లేకపోవడం కూడా  ఓఆర్ఆర్ పై ప్రమాదాలకు ప్రధాన కారణం. ఔటర్​పై వెహికల్స్ స్పీడ్ కంట్రోల్​కు చర్యలు చేపట్టడంలో ట్రాఫిక్ పోలీసులు విఫలమయ్యారు. స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసే విషయంలో హెచ్ఎండీఏ, పోలీసు శాఖకు మధ్య ఖర్చుల భారం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. ఇప్పటికీ చాలా చోట్ల సర్వీస్ రోడ్లపై ఆగిన వాహనాలను క్లియర్ చేసే పరిస్థితి లేకపోవడంతో కూడా సర్వీస్ రోడ్ రూట్లలోను యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.

గచ్చిబౌలి టూ శంషాబాద్ డేంజర్..

గచ్చిబౌలి నుంచి శంషాబాద్ మార్గంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ రూట్ లో రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అట్లనే కీసర, ఘట్ కేసర్, పెద్ద అంబర్ పేట్ టోల్ ప్లాజా, శంకర్ పల్లి వంటి రూట్లలో కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అవి కూడా పగటి పూటనే ఎక్కువగా జరుగుతున్నట్లు చెప్తున్నారు. డ్రైవర్ల డిస్టెన్స్ జడ్జిమెంట్ సరిగా లేకపోవడం, ఓవర్ టేక్ చేయడం కూడా ప్రమాదాలకు దారితీస్తుండగా, కొన్ని చోట్ల షార్ట్ కర్వ్ ల వద్ద సైన్ బోర్డులు లేక వెహికిల్స్ నియంత్రణ కోల్పోతున్నట్టు చెప్తున్నారు.

కంట్రోల్​పై దృష్టి పెట్టాం

ఓఆర్ఆర్ లో ప్రమాదాల కంట్రోల్‌‌పై దృష్టి పెట్టాం. నాలుగేండ్లుగా యాక్సిడెంట్లు  తగ్గుతున్నాయి. ఓఆర్ఆర్ పై సేఫ్టీ చర్యలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నం. సాంకేతిక లోపాలే ప్రమాదాలకు కారణమనేది అవాస్తవం. వాహనాలు స్పీడ్ పై కంట్రోల్ తప్పుతుండడం తోనే ప్రమాదాలకు జరుగుతున్నాయి.

– రవీందర్ సీజీఎం, హెచ్ జీసీఎల్

డిజైనింగ్ పై స్టడీ చేయాలి

ఓవర్‌ స్పీడే ప్రమాదాలకు కారణమంటున్నా ప్రాజెక్టులోని టెక్నికల్ లోపాలను అధ్యయనం చేయాల్సి ఉంది. డ్రైవర్లకు డిస్టెన్స్ జడ్జిమెంట్ పై స్పష్టత రాక.. ముందు వెహికల్స్‌ వేగాన్ని అంచనా వేయకలేక ప్రమాదాలు జరుగుతు న్నాయి. అలైన్ మెంట్ లో ఎత్తు పల్లాలు, డీపీఆర్ లో ఉన్నట్లుగా క్షేత్రస్థాయి రోడ్డు ఉందా లేదా అనే విషయాన్ని సమీక్షించి సవరణ చేయాలి. ఇక రైట్ ఆఫ్ వే, లైనింగ్, చేంజ్ ఆఫ్ లైన్ పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి.

– ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు, సివిల్ ఇంజినీరింగ్ ఎక్స్ పర్ట్​

For More News..

హైకోర్టుకు ఈ నెలలో 9 రోజులు సెలవులు

ఈ ఏడాది 20 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు

ఉమ్మడి రాష్ట్రంలో కబ్జాలు.. ఇప్పుడు సెటిల్‌మెంట్లు

 

 

Latest Updates