ఏపీలో జూనియర్ లాయర్లకు నెలకు 5 వేలు

‘వైఎస్ఆర్ లా నేస్తం’ స్కీమ్ ను ప్రారంభించిన జగన్

అమరావతి, వెలుగు: ఏపీలో జూనియర్ లాయర్లకు మూడేళ్లపాటు ప్రతి నెల రూ. 5 వేలు ప్రోత్సాహకం అందించే వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అర్హులైన లాయర్లకు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. లాయర్ల సంక్షేమం కోంస రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనికి ప్రతి బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. లాయర్ల చట్టంలో సవరణలపై ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ గంటా రామారావు, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ రామజోగేశ్వరరావు, బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొని సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

Latest Updates