పార్కింగ్ ప్లేస్ లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం.. ఆందోళనకు దిగిన అపార్ట్ మెంట్ వాసులు

హైదరాబాద్: త‌మకి కేటాయించిన‌ పార్కింగ్ ప్లేస్ లో.. అపార్ట్‌మెంట్ బిల్డ‌ర్ అక్ర‌మంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడంటూ ఆందోళ‌న‌కు దిగారు ఫ్లాట్ ఓన‌ర్స్. ఫ్లాట్స్ కొనుగోలు చేసే స‌మ‌యంలో పార్కింగ్ ప్లేస్ చూపించిన బిల్డర్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాగానే పార్కింగ్ ప్లేస్ లో షాపింగ్ కాంప్లెక్స్ కోసం షెటర్లు నిర్మిస్తున్నారని వాపోయారు. న‌గ‌రంలోని మూసాపేట్ లక్ష్మీనరసింహ అపార్ట్ మెంట్ లో ప్లాట్స్ కొనుగోలు చేయ‌గా.. సదరు బిల్డర్ గృహప్రవేశం జరిగిన కొద్ది రోజులకే తన అసలు రంగు బయటపెట్టాడ‌ని,
ఇదేంటని ప్రశ్నిస్తే త‌మ‌ పై వ్యక్తిగతంగా దూషణలకు దిగడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ప్లాట్ ఓన‌ర్స్ ఆదివారం అపార్ట్మెంట్ ‌ముందు ఆందోళన చేపట్టారు, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్లాట్ అమ్మకం సమయంలో తమకు కేటాయింపు చేస్తామన్నట్లుగానే పార్కింగ్ స్థలాలు కేటాయించాలని నినాదాలు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్.. బిల్డర్ కు వంతపాడుతూ అతనికే సహ‌కరిస్తున్నారని అంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ కూడా స్థానికుడు కాబట్టి చూసి చూడనట్టు వ్యవహారిస్తున్నారని చెబుతున్నారు. త‌మ‌కు వెంట‌నే న్యాయం చేయాలంటూ బాధితులు కోరుతున్నారు.

Latest Updates