హైదరాబాద్ లో జోరుగా ఇల్లీగల్ లేఅవుట్లు.. పట్టించుకోని అధికారులు

పట్టించుకోని హెచ్ఎండీఏ,జిల్లా యంత్రాంగం
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల సహకారం

హైదరాబాద్, వెలుగు: పేపర్లపై పరిష్మన్లు.. ఆ వెంటనే అందంగా పరుచుకునే రోడ్లు.. మరుసటి రోజుకల్లా టెంట్లు, సేల్స్ ఎగ్జిక్యూటి వ్ హడావుడి. ఇదీ మేడ్చల్ జిల్లాలో చేస్తున్న అక్రమ వెంచర్ల తీరు. హైదరాబాద్ శివార్లలో భూముల వాల్యూ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో కొందరు రియల్టర్ల అవతారమెత్తి జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. అక్రమ వెంచర్ల పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కలిపేసుకుని అమ్మేస్తున్నారు. మేడ్చల్ జిల్లా రియల్ వ్యాపారానికి హాట్ కేకులా మారింది. కొందరు రియల్టర్లుగా మారి ఊరికొక వెంచర్ చేసి అమ్మేస్తున్నారు. రెండు నుంచి పది ఎకరాల విస్తీర్ణంలో లే అవుట్లు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. క్షేత్రస్థాయి అధికారుల అండదండలతోనే పనికానిచ్చే స్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ భూములను సైతం వదలడం లేదు. స్థానికంగా ఉండే మాజీ సర్పంచులు, నేతల అండదండలతో లేని పత్రాలు సృష్టించి లేఅవుట్లు చేస్తున్నారు. ఆ వెంటనే అమ్మేస్తున్నారు. కొత్త జిల్లా గా ఏర్పడటం, పక్కనే వరంగల్ హైవే, దగ్గర్లోనే యాదగిరిగుట్ట ఉండటం, సిటీ శివారు కావడంతో మేడ్చల్ రియల్ వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా మారింది. జిల్లాలోని 9 మండలాల్లో ఎప్పటి కప్పుడు అక్రమ లేఅవుట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. స్థా నిక చోటామోటా లీడర్లు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు సహాకారానికి తోడు, పంచాయతీ సెక్రటరీల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం.

కలెక్టరేట్ కు కూత వేటు దూరంలోనే..

1989లో లే అవుట్ కు అనుమతులు తీసుకున్నట్లుగా అప్పటి సర్పం చ్, ఉప సర్పంచుల పేరిట స్టాంపులు సృష్టించి , లే అవుట్ ప్లా న్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు డెవలపర్ల నుంచి ఆమ్యామ్యాలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రైంలోకేషన్, రోడ్లు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఆనుకొని ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రియల్ వ్యాపారం నడుస్తోంది. కలెక్టరేట్ కు కూతవేటు దూరంలోని భోగారం, గోధుమకుంట, చీర్యాల, యాదగిరిపల్లి గ్రామాల్లో యథేచ్ఛగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి.

హెచ్ఎండీఏ ఆఫీసర్ల అండ

గ్రామస్థాయిలో లేఅవుట్లకు కచ్చితమైన పత్రాలు ఉంటేనే పరిష్మన్లు ఇస్తామని చెప్పిన హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారులకు ఈ అక్రమ లేఅవుట్లు కనిపించట్లేదు. హెచ్ఎండీఏ వర్గాలే అండగా ఉన్నట్లు కీసరకు చెందిన రియల్ వ్యాపారి చెప్పారు.

ఇవిగో ఇవే..

గోధుమకుంటలోని ఓ లేఅవుట్ పక్కనే రాంపల్లి దాయరకు సంబంధించిన 20 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని లేఅవుట్లో కలిపేశారు. భోగారం మఠం బావి వద్ద సర్వే నెం.11,12,13,16 లో 12 ఎకరాల విస్తీర్ణంలో చేసిన లేఅవుట్ ప్రభుత్వ స్థలంలోనే ఉంది. యాదగిరిపల్లిలో సర్వే నెం. 242 లో కల్వర్ట్ ను కలుపుకుని నాలాను కబ్జా చేశారు. ఘట్ కేసర్, మేడ్చల్, దుండిగల్, కుత్బుల్లా పూర్ మండలాల పరిధిలో జోరుగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి.

see also: బీచ్ లో యువకుడు గల్లంతు

టెన్త్​ నుంచే ఆన్​జాబ్​ ట్రైనింగ్​

కాగ్నిజెంట్‌ లో 20వేల మందికి జాబ్స్

Latest Updates