టెక్నికల్ ప్రాబ్లమ్ తో ఫ్లైట్ క్యాన్సిల్ : శంషాబాద్ లో ప్రయాణికుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా: టెక్నికల్ ప్రాబ్లమ్ తో  హైదరాబాద్ నుండి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం క్యాన్సిల్ అయ్యింది. ఈ ఉదయం 9 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AI 966లో సడెన్ గా టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. దాదాపు గంటకు పైగా ఆలస్యం కావడంతో ఇక చేసేదేమిలేక ఇవాళ ఫ్లైట్ ను క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపారు ఎయిర్ ఇండియా అధికారులు.

దీంతో ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అర్జెంటుగా ముంబైకి వెళ్లాలని..ఇలాంటి సమయంలో షాకిస్తే మేం ఎలా ప్రయాణం చేయాలని యిర్ ఇండియాపై సీరియస్ అయ్యారు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది వచ్చి పరిస్థితిని చక్క దిద్దారు. మరో ఫ్లైట్ సమయాలను వారికి వివరించారు.

Latest Updates