స్టూడెంట్లపై ఫ్లైట్‌‌‌‌ ఫ్యూయెల్‌‌‌‌ వాన

స్కూల్లో ఆడుకుంటున్న పిల్లలపై పడి 20 మందికి దద్దుర్లు

అది అమెరికాలోని లాస్‌‌‌‌ ఏంజెలెస్‌‌‌‌. ఓ స్కూలు గ్రౌండ్‌‌‌‌లో పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్లతో పాటు టీచర్లూ ఉన్నారు. ఇంతలో ఏదో వర్షంలా మీద పడింది. కొద్దిసేపటికే పిల్లలకు, పెద్దలకు చర్మంపై దురదలు స్టార్టయ్యాయి. కొందరు అస్వస్థతకూ గురయ్యారు. వాళ్లను వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లారు. మరి వాళ్ల మీద పడిందేంటి? అంటే విమాన ఇంధనం. డెల్టా ఎయిర్‌‌‌‌లైన్స్‌‌‌‌కు చెందిన ఓ విమానంలో సమస్య రావడంతో ఇంధనాన్ని పైలెట్లు కిందికి వదిలారు. లాస్‌‌‌‌ ఏంజెలెస్‌‌‌‌ నుంచి చైనాలోని షాంఘైకి డెల్టా ఫ్లైట్‌‌‌‌ 89 మంగళవారం బయలుదేరింది. కానీ, ఇంజన్‌‌‌‌లో సమస్య వల్ల ఫ్లైట్‌‌‌‌ను అర్జెంట్‌‌‌‌గా దించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఇంధనాన్ని పైలెట్లు కిందికి వదిలారు. అది కాస్త పార్క్‌‌‌‌ ఎవెన్యూ ఎలిమెంటరీ స్కూలులో ఆడుకుంటున్న స్టూడెంట్లపై పడింది. ఇంకా చాలా ప్రాంతాల్లోనూ పడిపోయింది. ఈ ఘటనతో 20 మంది స్టూడెంట్లు, 11 మంది సిబ్బందికి చర్మంపై దద్దుర్లొచ్చాయి. గాల్లో కూడా ఇంధనం ఆవిరై వ్యాపించడంతో ఆ దగ్గరి ప్రాంతాల జనం ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఇంధనాన్ని రిలీజ్‌‌‌‌ చేసేందుకు ఫ్లైట్‌‌‌‌ సిబ్బంది అనుమతి తీసుకోలేదని ఫెడరల్‌‌‌‌ ఏవియేషన్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌ఏఏ) చెప్పింది. ఇలాంటి విషయాలను ముందే చెబితే సురక్షితమైన, జనం లేని ప్రాంతాన్ని వాళ్లకు చూపిస్తామని, . తక్కువ ఎత్తులో ఇంధనాన్ని డంప్‌‌‌‌ చేయకూడదని పేర్కొంది.

Latest Updates