ఆరుసిటీల నుంచి కోల్‌కతాకు ఫ్లయిట్స్ బంద్

కోల్‌కతా: బెంగాల్ లో కరోనా కేసులు రో జురోజుకు పెరుగుతున్న దృష్ట్యా అక్కడి ప్రభుత్వం కీలక నిరయ్ణం తీసుకుంది. కరోనా  హాట్ స్పాట్ లు గా ఉన్న ఆరు సిటీల నుంచి విమానాల రాకపోకలను బంద్ పెట్టింది. ఈనెల 6 నుంచి 19 వరకు ఢిల్లీ, ముంబై, పూణే, నాగపూర్, చెనై, అహ్మదాబాద్ నుంచి వచ్చే విమానాలకు అనుమతివ్వమని ఎయిర్ పోర్ట్​ అధికారులు శనివారం ప్రకటించారు. లాక్ డౌన్ వల్ల రెండు నెలల తర్వాత డొమెస్టిక్ పాసింజర్ ఫ్లయిట్స్​సర్వీసులు మే 25 నుంచి ప్రారంభమయ్యాయి. ఐతే ఇతర సిటీల నుంచి వచ్చే వారి కారణంగానే కోల్ కతాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని బెంగాల్ ప్రభుత్వం భావిస్తోంది. అందువల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్న సిటీల నుంచి ఫ్లైట్స్ ను రాని వ్వద్ద ని నిర్ణయించింది.

Latest Updates