ఇవాళ్టి నుంచి భారత్ నుంచి బ్రిటన్ కు విమానాలు ప్రారంభం

బ్రిటన్ లో కరోనా స్ట్రెయిన్ కారణంగా ఆ దేశానికి విమాన రాకపోకలను నిలిపివేసిన ప్రభుత్వం… ఇవాళ్టి(శుక్రవారం) నుంచి మళ్లీ రాకపోకలకు అనుమతి ఇచ్చింది. అయితే ప్రయాణానికి మూడు రోజుల ముందు కరోనా నెగటివ్ ఉన్నట్లుగా సర్టిఫికెట్ తప్పని సరి అని స్పష్టం చేసింది.

శుక్రవారం నుంచి హైదరాబాద్ నుంచి బ్రిటన్ కు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.

యూకేలో కొత్త కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా దేశవ్యాప్త లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తామని తెలిపారు ఆ దేశ ప్రధాని బోరిస్  జాన్సన్. విదేశీ ప్రయాణికులంతా నిబంధనల ప్రకారం క్వారంటైన్ కావాల్సిందేనని స్పష్టం చేశారు.

Latest Updates