లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసేలోపు ఒకరి డ్రస్ మరొకరు వేసుకోవాలి

ఐ ఛాలెంజ్, క్యాప్ ఛాలెంజ్ ఈ మధ్య పలువురి ప్రాణాలు తీసిన స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ ఇలా ఒక్కటేమిటి రకరకాల ఛాలెంజ్ లు నెట్టింట్లో హడావిడి చేస్తున్నాయి. పేరుకోసం, డబ్బుల కోసం ఇలా పనీ పాట లేని కొందరు ప్రయోగాలు చేసి సోషల్ మీడియా  సెలబ్రిటీలుగా చలామణి అవుతుంటారు.

అలాంటి వారే తాజాగా  ఫ్లిప్ ది స్విచ్ఛ్ అనే ఛాలెంజ్ ను తెరపైకి తెచ్చారు. ఈ ఛాలెంజ్ పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. కానీ ఒక్కోసారి ఇబ్బందులు తప్పువు. ఓ పెద్ద అద్దానికి ఎదురుగా వీడియో ఆన్ చేసి డ్యాన్స్ చేయాలి. డ్యాన్స్ చేస్తుండగానే అందులో ఒకరు  లైట్ స్విచ్ఛ్ ఆఫ్ చేస్తారు. మళ్లీ స్విచ్ ఆన్ చేసేలోగా ఒకరి డ్రస్ మరొకరు వేసుకోవాలి. ప్రస్తుతం ఈ ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఈ ఛాలెంజ్ ను సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చేస్తున్నారు. అందులో ఎలిజిబెత్ రాణి, జెన్నీఫర్ లోఫెజ్ తో పాటు పలువురు ప్రముఖులున్నారు.

Latest Updates