ఫ్లిప్‌‌కార్ట్‌‌, యాక్సిస్‌‌ బ్యాంక్‌‌ నుంచి కో–బ్రాండెడ్‌‌ క్రెడిట్‌‌కార్డ్‌‌

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ–కామర్స్‌‌ కంపెనీ ఫ్లిప్‌‌కార్ట్‌‌, యాక్సిస్ బ్యాంక్‌‌.. పేమెంట్‌‌ గేట్‌‌వే మాస్టర్‌‌కార్డ్‌‌తో కలిసి కో–బ్రాండెడ్‌‌ క్రెడిట్‌‌కార్డ్‌‌ను గురువారం విడుదల చేశాయి. దీంతో ఆన్‌‌లైన్‌‌, ఆఫ్‌‌లైన్‌‌లో కొనుగోళ్లు జరిపితే అన్‌‌లిమిటెడ్‌‌ క్యాష్‌‌బ్యాక్‌‌లు ఇస్తారు. క్యాష్‌‌బ్యాక్‌‌లు నెలవారీ క్రెడిట్‌‌కార్డ్‌‌ బిల్లులో నేరుగా జమ అవుతాయి. ఫ్లిప్‌‌కార్ట్‌‌డాట్‌‌కామ్‌‌, 2గుడ్‌‌డాట్‌‌కామ్‌‌, మింత్రాలో షాపింగ్‌‌ చేస్తే ఐదుశాతం క్యాష్‌‌ బ్యాక్‌‌ ఉంటుంది. మేక్‌‌ మై ట్రిప్‌‌, గోఐబిబో, ఉబర్‌‌, పీవీఆర్‌‌, గానా, క్యూర్ఫిట్‌‌, అర్బన్ క్లాప్‌‌లో లావాదేవీలపై నాలుగుశాతం క్యాష్‌‌బ్యాక్‌‌ ఉంటుంది.

ఇతర మర్చంట్ల వద్ద కొంటే 1.5 శాతం క్యాష్‌‌బ్యాక్‌‌ ఇస్తారు. దేశవ్యాప్తంగా ఎయిర్‌‌పోర్టుల్లో లాంజ్‌‌లలోనికి ప్రవేశం ఉచితం. ఫ్లిప్‌‌కార్ట్‌‌లో ఈఎంఐ ద్వారా కొంటే రాయితీలు కూడా ఇస్తారు. ఫ్యూయల్‌‌ సర్‌‌చార్జ్‌‌ వేవర్‌‌, రెస్టారెంట్‌‌ డిస్కౌంట్లు వంటి ఇతర సదుపాయాలు ఉన్నాయి. ఈ క్రెడిట్‌‌కార్డ్‌‌ జాయినింగ్‌‌ ఫీజు రూ.500. ఏడాదిలో లావాదేవీల విలువ రూ.రెండు లక్షలు మించితే జాయినింగ్‌‌ ఫీజును రద్దు చేస్తారు.