ఫ్లిప్‌‌కార్ట్‌‌లో పండుగ జోష్

బిగ్ బిలియన్ డేస్ సందడి

ఈ నెల 29 నుంచి వచ్చే నెల 4 వరకు..

బెంగళూరు : ఫ్లిప్‌‌కార్ట్‌‌లో పండుగ సీజన్‌‌ ప్రారంభం కాబోతుంది. ఫెస్టివల్ సీజన్‌‌లో నిర్వహించే తన అతిపెద్ద ఫ్లాగ్‌‌షిప్ ఈవెంట్ ‘ది బిగ్ బిలియన్ డేస్’ను ఈ నెల 29 నుంచి వచ్చే నెల 4వ తారీఖు వరకు చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఫ్లిప్‌‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు నాలుగు గంటల ముందే బిగ్ బిలియన్ డేస్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఫ్లిప్‌‌కార్ట్ ఈ సేల్ కోసం ఇప్పటికే యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్‌‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బ్యాంక్‌‌ల కార్డు హోల్డర్స్‌‌కు స్పెషల్ ఆఫర్లను ఫ్లిప్‌‌కార్ట్ డిజైన్ చేస్తున్నట్టు తెలిపింది. గత కొన్ని నెలలుగా తమ సప్లయి చైన్‌‌ ను మరింత పెంచామని, ఫస్ట్ అండ్ లాస్ట్‌‌ మైల్ డెలివరీ రెండింటిలో సప్లయి చైన్‌‌ను బలోపేతం చేసినట్టు ఫ్లిప్‌‌కార్ట్ తెలిపింది. తాను డెలివరీ చేయబోయే ప్రాంతాలను కూడా ఫ్లిప్‌‌కార్ట్ రెండింతలు పెంచింది.

ఈ పండుగ సీజన్‌‌లో కస్టమర్ల నుంచి వచ్చే తాకిడిని తట్టుకోవడానికి సుమారు 30 వేల కిరాణాలను తన ప్లాట్‌‌ఫామ్‌‌పై యాడ్ చేసుకుంది. బిగ్ బిలియన్ డేస్ సమయంలో కస్టమర్లు.. లక్షల మంది సెల్లర్స్, బ్రాండ్స్, ఆర్టిషియన్స్ నుంచి అత్యధిక సంఖ్యలో బ్రాండ్లను, ప్రొడక్ట్‌‌లను కొనుగోలు చేసుకోవచ్చని ఫ్లిప్‌‌కార్ట్ పేర్కొంది. మొబైల్స్, గాడ్జెట్స్, టీవీలు, అప్లియెన్సస్, ఫ్యాషన్, పర్సనల్ కేర్, ఫర్నీచర్ వంటి అన్ని కేటగిరీలపై ఫ్లిప్‌‌కార్ట్ డీల్స్‌‌ను అందించబోతోంది. మొట్టమొదటిసారి ఈ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా అప్లియెన్సస్‌‌కు కస్టమర్లు ఇన్సూరెన్స్‌‌ను కూడా కొనుక్కోవచ్చని ఫ్లిప్‌‌కార్ట్ ప్రకటించింది.

Latest Updates