గేమింగ్ ప్రియుల కోసం : ఆసుస్ స్మార్ట్ ఫోన్

అసుస్ సంస్థ ప్లాగ్ ‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అదీ గేమింగ్ ప్రియుల కోసం. అసుస్‌ రిపబ్లిక్‌ ఆప్‌ గేమర్స్‌ (ఆర్వోజీ) ఇటీవల గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆర్వోజీ ఫోన్‌ 3ని విడుదల చేసింది.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ సందర్భంగా ఇండియన్‌ యూజర్లు ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ స్పెషల్‌ సేల్‌ ఐదురోజుల పాటు ఉంటుంది. రోగ్‌ ఫోన్‌ 3 విక్రయాలు ఆగస్టు 10 సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది.

8GB ర్యామ్‌ +128 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.. 49,999 కాగా, 8 GB ర్యామ్‌ + 256 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 57,999గా ఉంది. సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 1,500 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కూడా కూడా అందిస్తోంది.

ఫోన్ ఫీచ‌ర్స్ ఇలా ఉన్నాయి

ఆసుస్ ఆర్వోజీ ఫోన్ 3 ఫోన్ 6.59- అంగుళాలు

డిస్ ప్లే – హెచ్ డీ

రిఫ్రెష్ రేట్ -144హెచ్ జెడ్

శాంప్లింట్ పేట్ – 270 హెచ్ జెడ్

పిక్సెల్స్ రెజుల్యూష‌న్ – 1,080 x 2,340

కంపాట‌బిలిటీ – 5జీ

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ – 865+ ప్రాసెసర్

గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ -ఆడ్రినో 650 తో పాటు అన్నీ ర‌కాఫీచ‌ర్స్ తో వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది.

Latest Updates