కిరాణాషాపులతో ఫ్లిప్ కార్టు దోస్తీ

న్యూఢిల్లీ : దేశంలోని 27 వేల కిరాణాషాపులతో జట్టు కడుతున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. 700 నగరాలలోని ఈ కిరాణా షాపులతో కలవడం ద్వా రా పండగ సీజన్‌ (బిగ్‌ బిలియన్‌ డేస్‌) కోసం సప్లై చెయిన్ మరింత పటిష్టపరుచుకున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా కస్టమర్లకు డెలివరీ ఇచ్చేందుకే వారితో జత కడుతున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వివరించింది. కొత్త ప్రాంతాలు, కొత్త కస్టమర్లను చేరుకోవడం కూడా దీంతో సాధ్యపడుతుందని పేర్కొంది. కిరాణా షా పులకు అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపింది.కిరాణా షాపులను చేర్చుకునే ప్రయత్నం ఆరు నెలల కిందటే మొదలు పెట్టినట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. పండగ సీజన్లో కస్టమర్ల నుంచి వచ్చే ఆర్డర్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకునే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. దేశంలోని అన్ని పిన్‌కోడ్‌లకూ రోజూ 10 లక్షల షిప్‌మెం ట్లను చేరవేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది.

Latest Updates