ఫ్లిప్‌ కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్

ఫ్లిప్‌ కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్
రేపటి నుంచి శుక్రవారం వరకు…

న్యూఢిల్లీ : కొత్త స్మార్ట్‌ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయం. ఫ్లిప్‌ కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్‌‌ను ప్రకటించింది. రేపటి(ఈ నెల 17) నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్, శుక్రవారం(ఈ నెల 21) వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌‌లో, ఫ్లాగ్‌ షిప్, మిడ్ రేంజ్, బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఫ్లిప్‌ కార్ట్ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే అన్ని లావాదేవీలకు అదనంగా 10 శాతం డిస్కౌంట్‌‌ను ఇస్తోంది.

ఈ సేల్‌‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ స్మార్ట్‌ ఫోన్లు రూ.22,999కు, రూ.27,999కు అందుబాటులోకి వస్తాయి. రూ.89,999కు లాంచ్ అయిన ఐఫోన్ 10ఎక్స్ ఎస్ ను రూ.54,999కే కొనుగోలు చేయొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది.

మరిన్ని వార్తల కోసం

Latest Updates