బంపర్ ఆఫర్ : యాపిల్ ఐఫోన్ పై 40వేల డిస్కౌంట్

యాపిల్ ఐఫోన్ ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? ఇంకెందుకు ఆలస్యం ప్రముఖ ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు ఆఫర్లతో ఊరిస్తున్నాయి. అమెజాన్ తో పోటీ పడుతున్న ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ పై రూ.40వేల డిస్కౌంట్ ను ప్రకటించింది.

 ఫ్లిప్ కార్ట్ ” ది రిపబ్లిక్ డే సేల్”

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ను ప్రారంభించింది. అమెజాన్ కు పోటీగా ఫ్లిప్ కార్ట్ సైతం తన వినియోగదారులకు పలు ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.    ఫ్లిప్ కార్ట్ ” ది రిపబ్లిక్ డే సేల్” లో భాగంగా ఫ్లిప్ కార్ట్ మెంబర్స్ కు జనవరి 18 సాయంత్రం 8గంటల నుండి ప్రారంభం కాగా..పూర్తి స్థాయి సేల్ ను జనవరి 19నుంచి 22వరకు నిర్వహించనుంది. ఈ సేల్ లో భాగంగా టీవీ మరియు హోమ్ అప్లయన్సెస్ పై 75శాతం, ఎలక్ట్రానిక్ వస్తువులపై 80శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50 నుంచి 80శాతం, హోమ్ ఫర్నీచర్ పై 80శాతం, ఫ్లిప్ కార్ట్  బ్రాండ్ లపై 80శాతం డిస్కౌంట్స్ ఇస్తున్నట్లు తెలిపింది.  ఈ సదుపాయాన్ని ఫ్లిప్ కార్ట్ వినియోగదారులు  యాక్సిస్ , హెచ్ డీఎఫ్ సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ, కొటాక్ క్రెడిట్ కార్డ్ ల ద్వారా అదనంగా 10శాతం డిస్కౌంట్ ను అందిస్తుంది. డెబిట్ కార్డ్ వినియోగదారులుకు ఈఎంఐ ఆప్షన్, బై బ్యాక్ గ్యారంటీ, ఒక్కరూపాయికే కంప్లీట్ మొబైల్ ప్రొటక్షన్, నోకాస్ట్ ఈఎంఐ, ఎక్సేంజ్ ఆఫర్, ఫ్లిప్ కార్ట్ పే లేటర్ సౌకర్యాన్ని కల్పిస్తుంది.

యాపిల్ ఐఫోన్ పై 40వేల డిస్కౌంట్

ది రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ ఎక్స్ ఎస్ 64జీబీ మోడల్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. రిపబ్లిక్ డే సేల్ లో 64జీబీ  ఐఫోన్ ఎక్స్ ఎస్ ను కొనుగోలు చేసే కష్టమర్లకు రూ.40వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రముక ఈకామర్స్ వెబ్ సైట్ గాడ్జెట్స్ నౌ తెలిపింది. సాధారణంగా 64జీబీ  ఐఫోన్ ఎక్స్ ఎస్ ధర రూ. 89,900 ఉండగా రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా 40వేల డిస్కౌంట్ తో రూ.49,900కే ఇస్తున్నట్లు సదరు సంస్థ వివరించింది.  దీంతో పాటు ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో పై రూ.6వేల ఆఫర్ ఇస్తున్నట్లు గాడ్జెట్స్ నౌ తెలిపింది.

 

Latest Updates