నిరుద్యోగులకు శుభవార్త : 70 వేల మందికి ఉద్యోగాలు

త్వరలో 70వేల ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నట్లు ఇండియాకు చెందిన ప్రముఖ రీటైల్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. కరోనా క్రైసిస్ లో ఆన్ లైన్ షాపింగ్ చేసేందుకు వినయోగదారులు ఉత్సాహం చూపిస్తున్నారని, పైగా పండగ సీజన్లు కావడంతో సేల్స్ భారీ స్థాయిలో ఉంటాయని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులు చెప్పారు.

అక్టోబర్ లో పండగ సీజన్ సందర్భంగా వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రిలయన్స్ లు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ , అమెజాన్ ప్రైమ్ డే ల నాలుగు లేదా ఐదురోజు పాటు అమ్మకాలు ప్రారంభించి దీపావళితో ముగించనున్నాయి.

ఈ సేల్స్ సందర్భంగా పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న చిన్న పల్లెటూర్ల వరకు వినియోగదారులకు కావాల్సిన వస్తువుల్ని చేరవేసేలా డైరక్ట్ గా ఇన్ డైరక్ట్ గా సుమారు 70వేల కొత్త ఉద్యోగాల్ని సృష్టిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.

అంతేకాదు వినయోగదారులకు తమ ఫ్లాట్ ఫామ్ నుంచి వస్తువుల్ని చేరవేసేలా దేశంలో ఉన్న 50వేల చిన్నకిరాణా షాపుల నుంచి పెద్ద పెద్ద హోల్ సేల్ దుఖాలతో ఒప్పొందం కూదుర్చుకున్నట్లు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.

Latest Updates