ఫ్లిప్‌‌కార్ట్​లో ‘టచ్ అండ్ ఫీల్’ విధానం

  •                 లోకల్ స్టోర్లతో పార్టనర్‌‌‌‌షిప్

ఈకామర్స్ కంపెనీ ఫ్లిప్‌‌కార్ట్ తన కస్టమర్లకు టచ్ అండ్ ఫీల్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను అందించేందుకు సిద్ధమైంది. దీని కోసం లోకల్ స్టోర్లతో పార్టనర్‌‌‌‌షిప్‌‌ కుదుర్చుకుంటోంది. కొన్ని ప్రొడక్ట్‌‌లకు కస్టమర్లు టచ్ అండ్ ఫీల్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను కోరుకుంటున్నారని ఫ్లిప్‌‌కార్ట్ పేర్కొంది.  రిలయన్స్ లోకల్ కిరాణా స్టోర్లతో కలిసి గ్రోసరీలోకి అడుగుపెట్టేందుకు ప్లాన్ చేస్తోన్న క్రమంలో ఫ్లిప్‌‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. వాల్‌‌మార్ట్‌‌కు చెందిన ఫ్లిప్‌‌కార్ట్ లోకల్ కిరాణా స్టోర్లతో కలిసి డెలివరీ మోడల్‌‌ను ఏర్పాటు చేసింది. 700 నగరాల్లో 27000 స్టోర్లతో టైఅప్ అయింది. దీని కోసం స్టోర్లలో అధికారిక ‘బై జోన్స్’ ఏర్పాటు చేస్తోంది. కస్టమర్లు స్టోర్లకు వెళ్లి ప్రొడక్ట్‌‌ను చెక్ చేసుకుని, దాన్ని ఆన్‌‌లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ అధికారులు చెప్పారు. ‘హైదరాబాద్‌‌లో మా ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. లోకల్ స్టోర్లతో కలిసి మొబైల్స్‌‌కు టచ్ అండ్ ఫీల్ ఎక్స్‌‌పీరియెన్స్ అందించాం. ఆర్డర్‌‌‌‌ ఆన్‌‌లైన్‌‌లో స్వీకరించాం’ అని ఫ్లిప్‌‌కార్ట్ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజ్‌‌నీష్ కుమార్ చెప్పారు. దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా లోకలైజ్డ్ పార్టనర్‌‌‌‌షిప్‌‌లను పెంచుకుంటున్నామని తెలిపారు. దేశంలో మొత్తం రిటైల్ మార్కెట్‌‌లో ఆన్‌‌లైన్ మార్కెట్ కేవలం 3 శాతమే ఉందని కుమార్ చెప్పారు. ఫ్యాషన్‌‌ రంగంలో లోకల్ రిటైలర్లతో టైఅప్స్‌‌, ఈ–కామర్స్ కంపెనీకి మంచి ప్రయోజనం చేకూరుస్తాయని తెలిపారు.

Latest Updates