పడవలో నుండే సినిమా చూడొచ్చు

‘డ్రైవ్‌‌–ఇన్‌‌ థియేటర్స్‌‌’.. చాలా దేశాల్లో ఎప్పట్నుంచో ఉన్న ట్రెండ్‌‌. ప్లే గ్రౌండ్‌ లాంటి ప్లేస్‌లో ఉండే ఓపెన్‌ ‌ఎయిర్‌ స్క్రీన్‌‌పై సినిమాల్ని ప్లే చేస్తారు. ఆడియెన్స్‌‌  డైరెక్ట్‌ ‌గా కార్లలో వెళ్లి అక్కడ సినిమా చూడొచ్చు. ఇప్పుడు దీన్నే కొంచెం మార్చి ‘ఫ్లోటింగ్‌ థియేటర్‌‌’అనే కాన్సెప్ట్ ‌ను తీసుకొచ్చింది ప్యారిస్‌‌. అంటే పడవలపై వెళ్లి, సినిమా చూడటం. ఈ మధ్య అక్కడ జరిగిన ఒక ఈవెంట్‌‌లో ఈ కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. పైగా ఫిజికల్‌ ‌డిస్టెన్సింగ్‌‌కు కూడా అవకాశం ఉన్న కాన్సెప్ట్ ‌ఇది.

ప్యారిస్‌ ‌టూరిజం డిపార్ట్ మెంట్‌ తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్ ‌లో పడవల్లో ఫిజికల్‌ ‌డిస్టెన్స్ ను పాటిస్తూ సినిమా చూడొచ్చు. అక్కడి ‘సీన్‌‌’ నదీ తీరంలోఈ ఓపెన్‌ థియేటర్‌‌ను ఏర్పాటు చేశారు. ఆడియెన్స్‌ పడవల్లో వెళ్లి ఒడ్డున ఏర్పాటు చేసిన స్ర్కీన్ పై సినిమా చూడొచ్చు. మొత్తం 38 బోట్లను మాత్రమే అనుమతిస్తారు. ప్రతి బోట్‌‌లో ఇద్దరు నుంచి ఆరుగురు ఉండొచ్చు. ఒక షోకు మొత్తం 150 మంది ఆడియెన్స్ కు న్స్ ఉంటుంది. పడవల్లో డెక్‌‌పై నుంచి, సినిమా చూడాలి. పడవలు దూరం దూరంగా ఉంటాయి. పడవల్లోని వాళ్లు కూడా కరోనాకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్ల మధ్యలోఉంటారు కాబట్టి, ఎక్కడికీ వెళ్లలేరు. కచ్చితంగా దూరం పాటించాల్సిందే. అందుకే ఇప్పుడు ఈకాన్సెప్ట్‌ ట్రెండీగా అనిపిస్తోంది. ఇంతకీ ప్యారిస్‌‌లో ఏర్పాటు చేసిన ఈ ఫ్లోటింగ్‌ థియేటర్‌‌లో రెండు సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఒకటి ‘ఎ కరోనా స్టోరీ’ అనే షార్ట్ ఫిలిం. కరోనా నేపథ్యంగా రూపొంది, అవార్డులు కూడా గెలుచుకున్న షార్ట్ ఫిలిం ఇది. రెండోది ‘లెగ్రాండ్‌ బెయిన్‌‌’ అనే ఫ్రెంచ్‌‌ కామెడీ ఫిలిం . ఇది 2018లో రిలీజైంది.

కరోనాకు ఇది జవాబు

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని సినిమా థియేటర్లు మూత పడ్డాయి. ఫిజికల్‌ ‌డిస్టెన్సింగ్‌‌కు అవకాశం లేకపోవడం, కరోనా వచ్చే అవకాశం ఉండటంతో సినిమా థియేటర్స్‌ తెరుచుకోవడం లేదు. కానీ, ప్యారిస్‌ ‌తెచ్చిన ‘ఫ్లోటింగ్‌ థియేటర్ విత్‌‌ సోషల్‌ ‌డిస్టెన్సింగ్‌‌’ కాన్సెప్ట్‌ మంచి సక్సెస్‌‌ అయ్యే వీలుంది. చెరువులు, కొలనులు ఉన్న పట్టణాల్లోఇలాంటి థియేటర్స్‌ఏర్పాటుచేసిమూవీలవర్స్‌‌నుసినిమాకురప్పించవచ్చు. కరోనా టైమ్‌‌లోనే కాకుండా, మిగతా రోజుల్లో కూడా ఇది ఆడియెన్స్‌ ‌కుమంచి ఎక్స్‌ ‌పీరియెన్స్‌ ఇస్తుంది. ఫ్యూచర్‌‌లో ఇలా ఫ్లోటింగ్‌ థియేటర్స్ ట్రెండీగా మారినా ఆశ్చర్యపోనక్కర లేదు.

Latest Updates