అస్సాంలో వరద ఉధృతి: 109 మంది మృతి

అస్సాంలో ఇంకా వరదల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పవరకు ఈ వరదల ధాటికి చనిపోయిన వారి సంఖ్య 109కి చేరింది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో దాదాపు 12 లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురైనట్లు NDRF  అధికారులు తెలిపారు. 1364 గ్రామాలు వరద ముంపునకు గురికాగా..82,947 హెక్టార్లలోని పంట పొలాలు నీట మునిగాయి. నిరాశ్రయులైన ప్రజల కోసం 137 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. వీటిలో భారీ సంఖ్యలో బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. అంతేకాదు ఈ వరద ప్రభావానికి 26 జిల్లాల్లో 187 బ్రిడ్జీలు, కల్వర్టులతో పాటు 30 జిల్లాల్లోని 1937 రహదారులు కూడా ధ్వంసమయ్యాయి. మరోవైపు కజిరంగ జాతీయ పార్క్ లో నీటి స్థాయి తగ్గిందని..ప్రస్తుతం ఇంకా 60 శాతం వరద ముంపులోనే ఉందని పార్క్ అధికారులు తెలిపారు. అస్సా గవర్నర్ జగదీశ్ ముఖి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి…బాధితులను పరామర్శించారు.

Latest Updates