ఉత్తరాదిని వనికిస్తున్న వరదలు…

floods-in-himachal-pradesh-uttarakhand-2019

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు,  కాలువలు ఉప్పొంగుతున్నాయి. భాక్రా నంగల్ ప్రాజెక్టులో వాటర్ లెవల్ రికార్డు స్థాయికి చేరింది. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సాధారణ జనజీవనం స్తంబించింది.

బియాస్ నది ఉద్ధృతికి కుల్లు సమీపంలోని ఓ వంతెన నీటిలో కొట్టుకుపోయింది.  ఐదో నంబర్ జాతీయ రహదారి సహా పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. కులు మనాలిని కలిపే నేషనల్ హైవే పూర్తిగా పాడై పోయింది. దీంతో భారీ వాహనాల రాకపోకలను నిలిపేశారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో SDRF, రెడ్ క్రాస్, ITBP, NDRFబృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అటు కోల్ కతాలో ఎడ తెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. రోడ్లన్ని జలమయమయ్యాయి. వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Latest Updates