వరదలకు 1900 మంది బలి

  • 30 లక్షల మంది నిరాశ్రయులు
  • నేలకొరిగిన కోటి చెట్లు
  • ఉత్తర భారతంలో పెను ప్రభావం:రిపోర్టు

ఈ ఏడాది వరదలకు ఒక్క ఉత్తర భారతంలోనే 1,900 మంది బలైపోయారు. 30 లక్షలమందికిపైగా నిలువ నీడ కోల్పోయారు. వాతావరణంలో మార్పుల వల్ల చాలా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దాని వల్లే ఇలాంటి వరద ముప్పులు ముంచుకొస్తున్నాయని బ్రిటన్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ క్రిస్టియన్ ఎయిడ్ ప్రకటించింది . ఇండియా సహా ప్రపంచంలో వాతావరణ పరిస్థితు లపై రిపోర్టును విడుదల చేసింది . పెను తుఫాన్ల వల్ల దేశంలో కోటి చెట్ లు నేలకొరిగాయని రిపోర్టు పేర్కొంది . దాదాపు 71 వేల కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేసింది . ‘‘ఇండియాలో ఈ ఏడాది వచ్చిన అతి పెద్ద తుఫాన్లలో సైక్లోన్ ఫణి పెద్దది . గత 20 ఏళ్లలో వచ్చి న తుఫాన్లన్నింటి కెల్లా దాని ప్రభావం చాలా ఎక్కు వగా ఉంది. గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రచండ గాలులు వీచాయి. మే, జూన్ లలో ఆసియా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టాన్ని చవి చూసింది . ఇండియా, బంగ్లాదేశ్ , చైనాలోని కొన్ని ప్రాంతాల్లో 60 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షపాతం రికార్డయింది . ఉత్తర భారతంలో దాని ఎఫెక్ట్​ బాగా పడింది ” అని రిపోర్ట్​ పేర్కొంది .

వాతావరణం వేడెక్కడం వల్లే ఈ అతి వాతావరణ పరిస్థితు లకు కారణం, వాతావరణం వేడెక్కడమేనని రిపోర్ట్​ తెలిపింది . ఒక డిగ్రీ మేర టెం పరేచర్లు పెరిగాయని, అందుకే వరదలు, తుఫాన్ లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది . ఉత్తర భారతంలో తుఫాన్ల రాక 50 శాతం, వాటి ప్రభావం 80% పెరిగిందని చెప్పింది . కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గకపోతే పరిస్థితి మరిం త విషమిస్తుందని చెప్పింది . ఫణి తుఫాను వల్ల ఒక్క ఒడిశాలోనే లక్షా 40 వేల హెక్టార్ల మేర పంట నష్టం వాటిల్లిందని తెలిపింది . ఇండియాతో పాటు దక్షిణాఫ్రికా, ఉత్తరఅమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ ల్లో నూ తుఫాన్ లు విరుచుకుపడ్డాయని రిపోర్టు పేర్కొంది . చైనాలో లెకిమాటైఫూన్ , అమెరికాలో హరికేన్ డోరియన్లు విధ్వంసాన్ని సృష్టించాయన్నారు. జపాన్ ను హగిబిస్ టైఫూన్ అతలాకుతలం చేస్తే, కాలిఫోర్నియాను కార్చిచ్చు మంటల్లోకి నెట్టేసిందని ఆందోళన వ్యక్తం చేసింది . వాటి వల్ల లక్షా 78 వేల కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్టు చెప్పింది .

for more news

పోలీసులు లంచం అడిగారని పెట్రోల్ పోసుకున్నరు

Latest Updates