గాంధీ హాస్పిటల్ వైద్య సిబ్బందిపై రేపు హెలికాప్టర్లతో పూల వర్షం

కరోనా మహమ్మారిని తరిమేసేందుకు ముందు వరుసలో ఉండి పోరాడుతున్న కోవిడ్-19 యోధులు (వైద్య సిబ్బంది) కి కృత‌జ్ఞతలు తెలపడానికి భారత త్రివిధ దళాలు సిద్ధమయ్యాయి. కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులపై ఆదివారం (మే 3) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు పూలవర్షం కురిపించనున్నాయి. ఈ మేరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ శుక్రవారం వెల్లడించారు . ఢిల్లీ తో సహా వివిధ రాష్ట్రాల్లోని ఆసుపత్రులపై గులాబీ పూల వర్షం కురిపిస్తారు. ఈ కార్యక్రమం ఉ.9 గం.ల నుంచి 10.30 గం.ల వరకు కొనసాగుతుంది. మన రాష్ట్రంలో సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్ ప్రొ.జయశంకర్ విగ్రహం దగ్గర ఈ పూల వ‌ర్షం కురియ‌నుంది. వైద్య‌ సిబ్బందికి సంఘీభావంగా ఉదయం 9.30గంటలకు ఐఏఎఫ్‌ హెలికాఫ్టర్ల ద్వారా అధికారులు పూలవర్షం కురిపించనున్నారు. డాక్టర్ నుంచి స్వీపర్ దాకా ఆకాశం నుంచి గూలాబి పూల వర్షం కురిపించి సెల్యూట్ చేయనున్నారు హకీంపేట ఏయిర్ ఫోర్స్ అధికారులు.

Latest Updates