గూగుల్ మ్యాప్స్ తో డెడ్ బాడీ దొరికింది

మనిషి కనబడకుండా పోయిన 22 ఏళ్ల తర్వాత గుర్తింపు

ఓ వ్యక్తి కనబడకుండా పోయిన 22 ఏళ్ల తర్వాత అతని డెడ్ బాడీ దొరికింది. ఓ ఇంటి వెనకున్న చెరువులో నీట మునిగిన కారులో అతని అస్థిపంజరాన్ని గుర్తించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన జరిగింది. ఫ్లోరిడాలోని వెల్లింగ్టన్ లో ఓ ఇంటి వెనుకున్న చెరువులో కారు మునిగి ఉందని ఆ హౌస్ ఓనర్ కు ఓ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. ఆ ఇంటి యజమానేమో ‘హలో.. నేను 14 నెలలుగా ఈ ఇంట్లోనే ఉంటున్నా. ఇప్పటివరకు చెరువులో ఏ కారూ చూడలేదు’ అన్నారు. ఇవతలి వ్యక్తి.. ‘గూగుల్ మ్యాప్ లో మాత్రం కారు కనబడుతోంది సార్’ అని చెప్పారు. దీంతో ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారమిచ్చాడు.

వాళ్లొచ్చి చూస్తే నిజంగానే కారుంది. కష్టపడి బయటకు తీశారు. డోర్ తెరిచి చూస్తే అస్థిపంజరం. ఆ అవశేషాలు1997లో అదృశ్యమైన విలియం ఎర్ల్ మోల్ట్ అనే వ్యక్తివని గుర్తించారు. నైట్ క్లబ్ నుంచి రాత్రి 11 గంటలకు కారులో బయలుదేరిన విలియం.. ఇంటికి వస్తున్నట్లు తన గర్ల్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఆయన ఇంటికి చేరుకోలేదు. మిస్సింగ్ కేసు నమోదైంది. విలియం కారు బయటపడిన ప్రాంతంలో అప్పట్లో ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. విలియం కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లి మునిగిపోయింది. కానీ ఎవరూ గుర్తించలేదు. ఆ ప్రాంతం డెవలప్ అయిన తర్వాత కూడా చెరువులో కొన్ని మీటర్ల లోతులో ఉన్న కారును ఎవరూ గమనించలేకపోయారు. ఇప్పటికి 22 ఏళ్ల తర్వాత గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆయన డెడ్ బాడీ బయటపడింది.

Florida Man's Body Discovered by Accident 22 Years Later Using Images From Space

Latest Updates