కరోనా కాలంలో ఫ్లైట్‌ జర్నీ చేస్తున్నరా? ఏయే రాష్ట్రంలో ఏ రూల్స్‌ ఉన్నాయో చూడండి

న్యూఢిల్లీ: కరోనా కాలంలో ఫ్లైట్‌ జర్నీ చేసేవారికి ఎయిర్‌‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కొన్ని గైడ్‌లైన్స్‌ను రిలీజ్‌ చేసింది. క్వారంటైన్‌ రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ ఏయే రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో చెప్పింది. అన్‌లాక్‌ 3.0 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏయే రాష్ట్రాల్లో రూల్స్‌ ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తూ గైడ్‌లైన్స్‌ రిలీజ్‌ చేశారు. రాష్ట్రాల వారీగా ఇదే ఆ గైడ్‌లైన్స్‌

ఢిల్లీ: ప్యాసింజర్లుకు కరోనా టెస్ట్‌ అవసరం లేదు. ఎయిర్‌‌పోర్ట్‌లో స్క్రీనింగ్‌ చేస్తారు. ఇంటర్నేషనల్‌ ప్యాసింజర్లు అయితే ఏడు రోజుల ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉండాలి. 7 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. డొమస్టిక్‌ ప్యాసింజర్లు 7 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. కాన్‌స్టిట్యూషనల్‌, గవర్నమెంట్‌ ఫంక్షనరీస్‌కి అవసరం లేదు. అందరూ కచ్చితంగా ఆరోగ్యసేతలు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

హర్యానా: కరోనా టెస్టులు అవసరం లేదు. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు. 14 రోజులు క్వారంటైన్‌, ఆరోగ్య సేతు యాప్‌ కంపల్సరీ.

బీహార్‌‌: ప్యాసింజర్లకు క్వారంటైన్‌ అవసరం లేదు. ఆరోగ్య సేతు యాప్‌ కంపల్సరీగా ఉండాలి.

వెస్ట్‌బెంగాల్‌: థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి లక్షణాలు ఉన్న ప్యాసింజర్లను క్వారంటైన్‌ టెస్టులకు తరలిస్తారు. లక్షణాలు లేని వారిని 14 రోజులు క్వారంటైన్‌ విధిస్తారు. హెల్త్‌ డిక్లరేషన్‌, ఆరోగ్య సేతు యాప్‌ కంపల్సరీ.

మహారాష్ట్ర: ఔరంగాబాద్‌, పుణే, షిర్డీ, నాగ్‌పూర్‌‌, ముంబై, కోల్హాపూర్‌‌ ఎయిర్‌‌పోర్ట్‌లకు వచ్చేవారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు. ఇంటర్నేషనల్‌ ప్యాసింజర్స్‌ 7 రోజులు ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌, 7 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. డొమస్టిక్‌ ప్యాసింజర్లకు 14 రోజులు కంపల్సరీ హోం క్వారంటైన్‌లో ఉండాలి.

ఆంధ్రప్రదేశ్‌ : 10 శాతం మందికి ర్యాండమ్‌గా టెస్టులు చేస్తారు. అందరికీ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. 60 ఏళ్లు పైబడిన వారు, 10 ఏళ్ల లోపు పిల్లలక ఎయిర్‌‌పోర్ట్‌లో స్వాబ్‌ టెస్టులు చేస్తారు. డొమస్టిక్‌ ప్యాసింజర్లకు14 రోజులు క్వారంటైన్‌ కంపల్సరీ. అందరూ కచ్చితంగా స్పందన వెబ్‌సైట్‌లో రిజిటర్‌‌ చేసుకోవాలి. ఆరోగ్యసేతు తప్పనిసరి.

తెలంగాణ: థర్మల్‌ స్క్రినింగ్‌ చేస్తారు. ఇంటర్నేషనల్‌ ప్యాసింజర్లు ఏడు రోజుల ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉండాలి.

 

Latest Updates