‘గిటార్​’ తక్కువ తాగుతది

flying-v-plane-named-after-a-guitar-burns-20-less-fuel

ఇది గిటార్​. విమానాన్ని పట్టుకుని గిటారంటారా.. మమ్మల్ని మోసం చేయలేరు అంటారా? అవును అది విమానమే.. అది గిటారే. ఇంకా అర్థం కాలేదా ఇది ‘గిటార్​ విమానం’! పేరు ఫ్లయింగ్​ వీ. నెదర్లాండ్స్​కు చెందిన కేఎల్​ఎం అనే ఎయిర్​లైన్స్​ కంపెనీ ఈ విమానాన్ని తయారు చేయిస్తోంది. ఇప్పటికే ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో విమానాల ఆకారాన్ని పూర్తిగా మార్చేసేలా ముందడుగు వేస్తున్నారట. మహామహులైన మ్యూజీషియన్స్​ వాయించిన గిబ్సన్​ ‘ఫ్లయింగ్​ వీ’ అనే ఎలక్ట్రిక్​ గిటార్​ పేరునే పెట్టారు. డెల్ఫ్​ టెక్నాలజీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ కాన్సెప్ట్​ను తయారు చేశారు. రెక్కల్లోనే ప్రయాణం చేసేలా వీ టైప్​ రెక్కలుంటాయి. తోక అంటారా.. కోసి పడేశారు సైంటిస్టులు. మామూలు విమానాల కన్నా కూడా 20 శాతం తక్కువ ఇంధనాన్ని తాగుతుందట. ఈ విమానానికి రెక్కలపైన ఒక్కోటి చొప్పున రెండు ఇంజన్లుంటాయి. విమానం వెడల్పు 215 అడుగులైతే పొడవు కేవలం 180 అడుగులు. 314 మంది ప్రయాణించేలా దీనికి డిజైన్​ చేశారు. లోపల సీటింగ్​నూ కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతమున్న ఎయిర్​బస్​ ఏ 350, బోయింగ్​ 787 విమానాలకు ఇది గట్టి పోటీనిస్తుందని కేఎల్​ఎం సంస్థ మంచి ధీమాతో ఉంది.

 

 

 

Latest Updates