వంటనూనెల ధరలు పెరిగినయ్..​ మిగతావి కూడా క్యూలో

  • రా మెటీరియల్స్​ రేట్లు పెరగడమే కారణం
  • సఫోలా, పారాచూట్​ పోర్ట్​ఫోలియో రేట్లు పెంచుతున్నట్లు మారికో ప్రకటన
  • వేచి చూస్తున్న పార్లే, డాబర్​, పతంజలి

న్యూఢిల్లీ: రా మెటీరియల్స్​ రేట్లు పెరుగుతుండటంతో ఫాస్ట్​ మూవింగ్​ కన్స్యూమర్​ గూడ్స్​ (ఎఫ్​ఎంసీజీ ) కంపెనీలు తమ ప్రొడక్ట్స్​రేట్లనూ పెంచాలని చూస్తున్నాయి. మారికో వంటి కొన్ని కంపెనీలు ఇప్పటికే రేట్లను పెంచగా, డాబర్​, పార్లే, పతంజలి వంటి మరికొన్ని కంపెనీలు పెంచేందుకు సిచ్యుయేషన్​ను గమనిస్తున్నాయి. కోకోనట్​ ఆయిల్, ఎడిబుల్​ ఆయిల్​, పామ్​ ఆయిల్​ వంటి రా మెటీరియల్స్​ రేట్లు పెరగడంతో, దానికనుగుణంగా తమ ఫినిష్డ్​ ప్రొడక్ట్స్​ రేట్లను సవరించాలని ఎఫ్​ఎంసీజీ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. రేట్లను పెంచకపోతే తమ ప్రాఫిటబులిటీ పడిపోతుందని ఆందోళన చెందుతున్నాయి. గత మూడు, నాలుగు నెలలుగా ఎడిబుల్​ ఆయిల్​ రేట్లు బాగా పెరిగాయి. దీంతో మా మార్జిన్స్ పై ప్రభావం పడుతోంది. ఇప్పటిదాకా రేట్లు పెంచలేదు, కానీ రా మెటీరియల్స్​ రేట్లు ఇలాగే పెరిగితే, మా ప్రొడక్ట్స్​ రేట్లు పెంచకతప్పదని పార్లే ప్రొడక్ట్స్​ సీనియర్​ కేటగిరీ హెడ్ మాయాంక్​ షా చెప్పారు. కమోడిటీస్​ రేట్లు ఒక దశలో పెరగడం, ఆ తర్వాత మళ్లీ తగ్గడం (అంటే సైక్లికల్​) సాధారణమేనని అన్నారు. ఎడిబుల్​ ఆయిల్​ వాడే అన్ని ప్రొడక్ట్స్​ రేట్లనూ పెంచాల్సి ఉంటుందని, పెంపుదల కనీసం 4 నుంచి 5 శాతం దాకా ఉంటుందని షా చెప్పారు. ఆమ్లా, గోల్డ్​ వంటి రా మెటీరియల్స్​ రేట్లు ఇటీవల బాగా పెరిగాయని డాబర్​ ఇండియా సీఎఫ్​ఓ లలిత్​ మాలిక్​ తెలిపారు. ఫ్యూచర్​లోనూ ఇదే ట్రెండ్​ కొనసాగొచ్చని అంచనా వేస్తున్నాం. వీలైనంత వరకూ దీనిని కస్టమర్లపై వేయకూడదనే అనుకుంటున్నామని మాలిక్​ పేర్కొన్నారు. కాకపోతే, తప్పనిసరయిన కొన్ని ప్రొడక్ట్స్​ రేట్లు మాత్రం పెరగొచ్చని వెల్లడించారు. మార్కెట్లో పోటీనీ దృష్టిలో ఉంచుకునే రేట్ల పెంపుదల ఉంటుందని చెప్పారు.

రేట్లు పెంచక తప్పదంటున్న కంపెనీలు

ప్రొడక్ట్స్​ రేట్లను పెంచే విషయంలో పతంజలి ఆయుర్వేద ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కాకపోతే, ఆ దిశలో ఆలోచిస్తున్నట్లు మాత్రం సంకేతాలిస్తోంది. చాలా వరకు రా మెటీరియల్స్​రేట్ల పెరుగుదలను కస్టమర్లపై వేయకుండా ఉండటానికే ప్రయత్నిస్తామని, తప్పనిసరయితేనే రేట్ల పెంపుదల విషయంలో ఫైనల్​ డెసిషన్​ తీసుకుంటామని పతంజలి స్పోక్స్​ పర్సన్​ ఎస్​ కే తిజారావాలా తెలిపారు. సఫోలా, పారాచూట్​ వంటి బ్రాండ్ల సొంతదారు మారికో మాత్రం ఇప్పటికే కొన్ని ప్రొడక్ట్స్​పై రేట్లను పెంచింది. కొన్ని ప్రమోషన్స్​నూ మానుకున్నామని, పారాచూట్​, సఫోలా ఎడిబుల్​ ఆయిల్​ పోర్ట్​ఫోలియోస్​ రేట్లను పెంచడం గత క్వార్టర్లోనే తప్పనిసరయిందని మారికో రిజల్ట్స్​ సందర్భంగా గత వారంలో వెల్లడించింది. పామ్​ ఆయిల్​, టీ, కోప్రా, ఎడిబుల్​ ఆయిల్స్​ వంటి చాలా రా మెటీరియల్స్​ రేట్లు పెరిగాయని ఎడిల్​వీస్​ ఎగ్జిక్యూటివ్​ వైస్​ ప్రెసిడెంట్​ అబ్నీష్​ రాయ్​ చెప్పారు. గ్రాస్​ మార్జిన్స్​పై ప్రభావం పడుతుండటంతో 2021లో రేట్లను ఎఫ్​ఎంసీజీ కంపెనీలు పెంచక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. రేట్ల నిర్ణయం విషయంలో ఎఫ్​ఎంసీజీ కంపెనీలకు పవర్​ ఎక్కువని, ఒకేసారి అవి రేట్లను పెంచవని, క్రమంగా పెంచుకుంటూ వెళ్లగలవని పేర్కొన్నారు. అగ్రి ఇన్​పుట్స్​ రేట్లు పెరగడంతో ఎఫ్​ఎంసీజీ కంపెనీలు మార్జిన్స్​ ప్రెజర్​ ఎదుర్కొంటున్నాయని, అయితే కస్టమర్లపై ఈ బరువును ఇప్పుడే మోపకపోవచ్చని ఈవై పార్ట్​నర్​ (కన్స్యూమర్​ అండ్​ రిటెయిల్​) పినాకరంజన్​ మిశ్రా అభిప్రాయపడ్డారు.

Latest Updates