కాశ్మీర్​లో ఆర్మీ డబుల్ ఎటాక్.. కుల్గాం, అనంతనాగ్​లో టెర్రరిస్టుల ఏరివేత

  • ఎన్​కౌంటర్​లో నలుగురు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో సెక్యూరిటీ సిబ్బంది రెండు ప్రాంతాల్లో ఒకే సారి దాడి చేశాయి. కుల్గాం, అనంతనాగ్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి సెర్చింగ్ ఆపరేషన్స్ చేపట్టాయి. దక్షిణ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లా నిపోరా ప్రాంతంలో టెర్రరిస్టులు దాక్కున్నారన్న పక్కా సమాచారంతో కాశ్మీర్ లోకల్ పోలీసులు, ఆర్మీకి చెందిన 19 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ ఫోర్సెస్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్ కౌంటర్ లో సెక్యూరిటీ సిబ్బంది.. శనివారం ఉదయం ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. ఎన్​కౌంటర్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు.

అనంతనాగ్ జిల్లాలోని లలన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి నుంచి జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్ లో టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. తిరిగి కాల్పులు చేపట్టిన సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు టెర్రరిస్టులు మట్టుబెట్టారు. కాగా, గత వారం రోజులుగా షోపియాన్, అనంతనాగ్, కుల్గాం ప్రాంతాల్లో సెక్యూరిటీ సిబ్బంది టెర్రరిస్టుల కదలికలపై నిఘా పెంచారు. బుధవారం షోపియాన్ లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు.

Latest Updates