FOBలు తొలగించాలి: సెంట్రల్‌ రైల్వే

ముంబైలోని పలు స్టేషన్లలో ఉన్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి (FOB)లను తొలగించాలని సెంట్రల్‌ రైల్వే అధికారులు నిర్ణయించారు. ముంబైలోని భందూప్‌, కుర్లా, విఖ్రోలి, దివ, కళ్యాణ్‌ జంక్షన్‌ల దగ్గర ఉన్న FOBలను తొలగించాలని నిర్ణయించారు. ఇటీవల ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఆజాద్‌ మైదాన్‌ పోలీస్‌ స్టేషన్‌ మధ్య ఉన్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

 

Latest Updates