పెద్ద తలలే టార్గెట్..!

  • మావోయిస్టుల మూలాలపై కేంద్ర హోం శాఖ దృష్టి

మావోయిస్టు పార్టీ అగ్ర నేతలే టార్గెట్ గా ‘ఆపరేషన్ సరెండర్ ‘ అమలు చేస్తోంది కేంద్ర హోం శాఖ. ఇన్నాళ్లూ కూంబింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,ఎన్ కౌంటర్లతో సమాధానం చెప్పిన భద్రతా బలగాలు తమ పంథా మార్చి పరోక్ష పద్ధతులతో మావోయిస్టు పార్టీని నిర్వీర్యం చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసమే ఆపరేషన్ సరెండర్ ను తెరపైకి తెచ్చింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సట్వాజీతో మొదలైన ఈ ఆపరేషన్ తో మరింత మంది అగ్రనేతలు లొంగి పోయేలాచేసే దిశగా అడుగులు వేస్తోంది. కేం ద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులే లక్ష్యంగా జాబితా తయారు చేసి.. ఒక్కొక్కరూ లొంగిపోయేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అగ్రనేతల ఆరోగ్య పరిస్థితులు, పార్టీలో సంక్షోభాలు, ఆధిపత్య ధోరణితో పాటు మారుతున్న వారి వ్యవహార శైలి గురించి ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం సేకరిస్తున్నాయి. పోలీసు శాఖ నివేదికలు, ఇన్ఫార్మర్లు ఇస్తున్న వివరాల ఆధారంగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు దేశవ్యాప్తంగా ఆపరేషన్ సరెండర్ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయా రాష్ట్రాల పోలీసులతో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు సమాచారం. ఒకవైపు అడవుల్లో కూంబింగ్ చేస్తూనే మరోవైపు లొంగుబాటు ప్రక్రియను సీరియస్ గా చేపడుతోంది.

మావోయిస్టు పార్టీ కేం ద్ర కమిటీ సభ్యుడు సట్వాజీ సోదరుడు నారాయణ అరెస్టుతో ఈ ఆపరేషన్ మొదలైంది. గతేడాది ఏప్రిల్ లో జార్ఖండ్ రాంచీలో నారాయణ అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు . అప్పటి నుంచి జార్ఖండ్ పోలీసులతోపాటు, కేంద్ర ఐబీ అధికారులు నారాయణను విచారించి సట్వాజీ లొంగుబాటు ప్రక్రియ కోసం ఎత్తుగడలు వేశారు. నారాయణ తో పాటు మరికొందరు సాను భూతి పరుల నుంచి సట్వాజీ ఆరోగ్య పరిస్థితులు, బలహీనతలు, పార్టీ పరిస్థితుల గురించి సమాచారం సేకరిం చారు. ఎనిమిది నెలలపాటు పోలీసులు అమలు చేసిన వ్యూహాలకు ఫలితంలభించింది. పోలీసులు ఊహించి నట్లే సట్వాజీ తో పాటు ఆయన భార్య నీలిమ అలియాస్ మాధవి లొంగి పోయారు. రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, రాష్ట్ర నిఘా వర్గాలతో టచ్ లో ఉంటూ అత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్ ను అమలు చేసినట్టు తెలుస్తోంది. ఇది సక్సెస్ కావడంతో కేం ద్ర కమిటీ సభ్యులైన ఇరి వి మోహన్ రెడ్డి, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, రమణతో పాటు సీనియర్ నేతలైన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి,నల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తన్న అలియాస్ గోపన్న, కట్కూరి సత్యనా రాయణ అలియాస్ రంగన్న, రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ పై పోలీసులు దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.

Latest Updates