ఢిల్లీలో పొగమంచు..14 రైళ్లు ఆలస్యం

దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు కారణంగా నగరంలో 14 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్లపై కూడా పొగమంచు దట్టంగా ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. హెడ్‌లైట్లు వేసుకుని వెళ్తున్నా మంచుతో రహదారులు స్పష్టంగా కనబడక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే బయటకు వచ్చిన స్థానికులు కూడా  నానా ఇక్కట్లు పడుతున్నారు.

 

Latest Updates