మూగజీవాల ఆకలి తీర్చిన్రు..

లాక్‌‌ డౌన్‌‌తో ఆహారం దొరక్క అలమటిస్తున్న మూగ జీవాలకు కొందరు ఆకలి తీరుస్తున్నారు. మెదక్ పట్టణానికి చెందిన కృష్ణ అనే కూరగాయల వ్యాపారి స్థానికంగా తిరిగే ఆవుల మందకు టమాటాలు, బీరకాయలను వేయగా.. సిద్దిపేట జిల్లా రేకులకుంట మల్లికార్జునస్వామి ఆలయం వద్ద వానరాలకు దుబ్బాక పట్టణానికి చెందిన యువకులు నేహాల్గౌడ్, నాగరాజుగౌడ్
ఆహారం అందజేశారు.

యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురంలో ఉన్న గో ఆశ్రమానికి అండగా ఉంటానని టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి చెప్పారు. ఆశ్రమాన్ని సందర్శించిన ఆయ‌న ప‌శుగ్రాసం, దాన అంద‌జేశారు.  గోవుల నిర్వహణకు సంబంధించిన వివరాలను నిర్వాహకుడు బోదానందగిరిని అడిగి తెలుసుకున్నారు.

Latest Updates