4 రోజుల త‌ర్వాత అన్నం తిన్న వలస కూలీలు

లాక్ డౌన్ కారణంగా వలస కూలీల పరిస్థితి దారుణంగా మారింది. తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎలాగైనా సొంతూరుకు వెళ్లాలని వందల కిలో మీటర్లను సైతం లెక్క చేయక పిల్లలతో కలిసి నడక సాగిస్తున్నారు. పటాన్ చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై బెంగళూరు నుంచి వలస కూలీలు నడుచుకుంటూ తమ సొంతూరుకి వెళుతున్నారు.

మహారాష్ట్రలోని నాగపూర్ వెళ్లేందుకు తాము ఐదు రోజులుగా నడుస్తున్నామని సదరు కూలీలు చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్ తో తిండి కూడా దొరక లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై స్థానికులు వారికి భోజనాలు పెట్టారు. దీంతో తాము నాలుగు రోజుల తరువాత ఇవాళే అన్నం తిన్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.

Latest Updates