బిల్లు ఇవ్వకపోతే ఫుడ్ ఫ్రీ

రైళ్లల్లో ప్రయాణిస్తున్నప్పుడు క్వాలిటీ ఫుడ్ సంగతి దేవుడెరుగు కానీ.. కనీసం తిన్నవాటికి బిల్లు కూడా ఇవ్వరు కొందరు అమ్మకందార్లు. దీనికి చెక్ పెట్టాలనే ఉద్ధేశంతో సరైన నిర్ణయం తీసుకుంది రైల్వే. రైళ్లల్లో ఎక్కువ ధరకు ఫుడ్ ఐటమ్స్ ను అమ్ముతున్నట్లు IRCTCకి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.

తన బండారం బయటపడుతుందనే ఉద్ధేశంతో అమ్మకందారులు బిల్లు కూడా ఇవ్వడంలేదు. ఈ క్రమంలోనే *నో బిల్ ది ఫుడ్ ఈజ్ ఫ్రీ* అనే పేరుతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ఇండియన్ రైల్వే. ఈ రూల్ ద్వారా ఏదైనా ఫుడ్ కొన్నప్పుడు బిల్లు ఇవ్వకపోతే.. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని.. ఫ్రీగా ఫుడ్ తీసుకోవచ్చని తెలిపింది రైల్వేశాఖ.

Latest Updates