జమానా తిరిగొచ్చింది.. ఆరోగ్యానికి మట్టి కుండల్లో వంట

కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. కొత్తవిపుట్టు కొస్తున్న కొద్దీ పాతవాటి రూపు చెరిగిపోతుంది. అయితే కొన్ని రోజులకు ఓల్డ్ఈజ్ గోల్డ్ అన్న మాదిరిగా మళ్లీ కొత్త కళతో తిరిగొస్తుంటాయి. మట్టి పాత్రల విషయంలోనూ ఇదే జరిగింది. అనేకరకాల మట్టిపాత్రలు ఇప్పుడు మార్కెట్ లో దర్శనమిస్తున్నాయి.రసం చేసుకోవడానికి ఒక గిన్నె, అన్నం వండుకోడానికి, కూర కోసం, వేపుడు కోసం, చపాతీ చేసుకోడానికి ఇలా అన్నిరకాల మట్టిపాత్రలు దొరుకుతున్నాయి. ప్లాస్టిక్ వల్ల తలెత్తుతున్న అనర్థాల గురించి అవగాహన పెంచుకున్న జనం ఇప్పుడు మట్టి నీళ్ల సీసాలతో పాటు కాపర్ వాటర్ బాటిల్స్‌ ను వాడుతున్నారు. దీనికి మూతలా ఒక చిన్న చెక్కపేడుపెట్టుకుని బయటకు కూడా తీసుకెళ్లొచ్చు.ఇందులో నీళ్లు ఎప్పుడు కూల్ గా కూడా ఉంటాయి. ఇలా అన్నిరకాల్లో మట్టిపాత్రలు లభిస్తుండటంతో చాలామంది కొనుగోలు చేసివినియోగిస్తున్నారు.

రెండు రోజులవరకూ పాడవదు స్టీల్ పాత్రలకంటే మట్టితో చేసినపాత్రలు చాలా బాగున్నాయి. వీటిలోచేసిన వంటలు రుచికరంగా ఉంటున్నాయి. స్టీల్ గిన్నెలలో ఉన్నఫుడ్ రోజు దాటితే పాడవుతుంది. కానీ మట్టి పాత్రలలో పెడితే రెండు రోజులవరకు కూడా పాడవదు. అందుకే వీటినే వాడుతున్నాం. మట్టి పాత్రలలో వండుకుని తినడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. అయితే వంట చేసేటప్పుడు అక్కడే ఉండాల్సి ఉంటుంది.- మానస, హౌస్‌‌‌‌వైఫ్‌

మొదట్లో కొనేవాళ్లు కాదు
చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మట్టి పాత్రలనే వాడేవారు. అందుకే దాన్నే వ్యాపారంగా చేద్దా మని ఆరోగ్య భారత్ సంస్థ నెలకొల్పా. మొదట్లో ఎవరు కొనేవాళ్లు కాదు. పగిలిపోతాయని.వంట చేసేటప్పుడు అక్కడే ఉండాల్సివస్తుందని చెప్పేవారు. కానీఉపయోగాలు తెలిసిన తర్వాత కొనేవాళ్లు పెరిగారు. సేల్స్‌‌‌‌ పెరుగుతుండడంతో ఆన్‌ లైన్‌ద్వారా వ్యాపారం చేయబోతున్నాం .- విజయ్( ఆరోగ్య భారత్ నిర్వాహకులు)

స్టీల్ గిన్నెలలో వండటం వల్లపోషకాలు ఆవిరై పోతాయి. మట్టిపాత్రల్లో అనేక పోషకాలుంటాయి. వీటిలో వండినవి తినడంవల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నూనెకూడా తక్కువ పడుతుంది. మట్టిసీసాలో ఉండేనీళ్లు మంచివి. ఇప్పుడు రెడీమేడ్‌ మట్టి కూడా మార్కెట్ లో దొరుకుతోంది కాబట్టి మట్టి పాత్రలు కొనేటప్పుడు చూసి కొనాలి.- డా. సన,న్యూట్రిషనిస్ట్, కేర్ హాస్పిటల్స్

Latest Updates