కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి..నలుగురు మృతి..పలువురికి తీవ్ర గాయాలు

ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ సమీపంలో పాదాచారుల వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదంలో నలుగురు చనిపోయారు. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి అజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ మధ్య నిర్మించిన  వంతెన రద్దీగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాద స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Latest Updates