భారీ వర్షానికి మునిగిన ఫుట్ బాల్ గ్రౌండ్

స్విమ్మింగ్పూల్ అనుకున్నారా? అట్లయితే వాన నీళ్లల్ల కాలేసినట్టే! ఎందుకంటే అది ఫుట్బాల్ గ్రౌండ్ కాబట్టి! నమ్మబుద్ధి కావట్లేదు కదా! అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో ఉన్న కలమజూలో భారీ వర్షం కురిసింది. దీంతో అక్కడి వెస్టర్న్ మిషిగన్ యూనివర్సిటీలోని వాల్డో ఫుట్బాల్ స్టేడియం ఇలా వరద నీటితో పోటెత్తింది. స్విమ్మింగ్పూల్లా మారిపోయింది. క్యాంపస్లో డ్రైనేజీ వ్యవస్థ మంచిగానే ఉన్నా, దానికి మించిన వర్షాలు పడడంతో వరద నీరు బయటకు వెళ్లలేకపోయింది. అంతేకాదు, దానికి పక్కనే ఉన్న బేస్బాల్ స్టేడియంనూ వరద ముంచెత్తింది. పార్కింగ్ స్థలాలూ మునిగిపోయాయి. యూనివర్సిటీకి చెందిన ఓ మహిళా ఉద్యోగి ఆ ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.

Latest Updates