ఫుట్ బాల్ కి పూర్వ వైభవం తీసుకురావాలి : వెంకటేష్

హైదరబాద్ ఫుట్ బాల్ కి పూర్వ వైభవం తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు సినీ నటుడు వెంకటేష్. బంజారాహిల్స్ లో హైదరబాద్ ఫుట్ బాల్ క్లబ్ జెర్సీని వెంకటేశ్ ఆవిష్కరించారు. ప్లేయర్లతో ఫోటో స్ దిగారు. తనకు క్రీడలంటే ఎంతో ఇష్టమన్నారు. క్రికెట్ తో పాటు ఎక్కువగా ఫుట్ బాల్ చూస్తుంటానన్నారు.

నవంబర్ 2వ తేది నుంచి ప్రారంభంకానున్న ఇండియన్ సూపర్ లీగ్ లో మొటిసారి హైదరబాద్ ఫ్రాంచైజీ బరిలోకి దిగబోతోంది. రెండు నెలల పాటు జరిగే ఈ లీగ్ లో.. మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.