ఆదాయం కోసం లిక్కర్ షాపులను అనుమతించం..

లిక్కర్ షాపులను తెరిచి మహారాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పిన రాజ్ ఠాక్రేను విమర్షించింది శివసేన. గురువారం మహారాష్ట్ర నవనిర్మాన్ సేన  చీఫ్ ఆ రాష్ట్ర సీఎంఓ కు లెటర్ రాశారు. అందులో.. లిక్కర్ షాపులను తెరిచి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. దీంతో పాటు హోటల్స్ ను కూడా తెరవాలని కోరారు. ఈ విషయంపై శివసేన శనివారం తన పేపర్ సామ్నాలో స్పందించింది. కరోనా విజృంబిస్తున్న పరిస్థితులలో లాక్ డౌన్ ను బ్రేక్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది.

ఆదాయం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని చెప్పింది శివసేన. లాక్ డౌన్ లో లిక్కర్ షాపులతో పాటు మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలు కూడా మూయబడ్డాయని గుర్తుచేసింది. ఒకవేల లిక్కర్ షాపులు తెరిస్తే బౌతిక దూరం పాటించడం సాధ్యం కాదని తెలిపింది. రాష్ట్రం సంక్షోభ సమయంలో ఉన్నప్పుడు  ప్రతిపక్షనాయకులు సలహాలు ఇవ్వాలని అయితే వారు వారి పని చేయడం లేదని పరోక్షంగా దేవేంద్ర ఫడ్నవీస్ ను తప్పుపట్టింది శివసేన.

Latest Updates