చంద్రబాబు ఒక రోజు దీక్ష: హోటళ్ల ఖర్చెంతో తెలుసా?

For his day-long protest, Chandrababu Naidu spends Rs 60 lakh on accommodation of supporters

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ, కేంద్రం తీరుపై నిరసనగా ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు. ధర్మపోరాట దీక్ష పేరుతో ఆయన చేపట్టిన నిరసనకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా అనేక జాతీయ పార్టీల నేతలు మద్దతు తెలిపారు.

ఈ దీక్షకు టీడీపీ నేతలు రాష్ట్రం నుంచి భారీగా తమ మద్దతుదారులను ఢిల్లీకి తరలించారు. 2500 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు దేశ రాజధానికి వచ్చారు. వారిలో 26 మంది ఏపీ మంత్రులు, 127 మంది ఎమ్మెల్యేలు, 41 మంది ఎమ్మెల్సీలు, 150 మంది జనరల్ బాడీ సభ్యులు ఉన్నారు. వీరందరికీ ఏపీ ప్రభుత్వమే ఢిల్లీలోని వేర్వేరు హోటళ్లలో వసతి ఏర్పాటు చేసింది.

ఈ హోటళ్ల ఖర్చెంతో తెలుసా?

చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తల వసతికి ఏపీ ప్రభుత్వం భారీగానే ఖర్చు పెట్టింది. దాదాపు 60 లక్షల రూపాయలు ఇందుకు ఖర్చయినట్లు తెలిసింది. పార్టీ నేతలు, కార్యకర్తల ప్రయాణానికి రూ.1.12 కోట్లు ఖర్చు పెట్టారంటూ చంద్రబాబుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి.

Latest Updates