ఎన్నికల కోసం: 3 కమిషనరేట్లు .. 31 వేల మంది సిబ్బంది

పోలింగ్ తేదీ సమీపిస్తుండగా పోలీసులు అలర్ట్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎలాంటి ఘటనలు జరుగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పక్కా ప్లాన్‌‌‌‌తో ముందుకెళ్తున్నారు .అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఇప్పుడు కూడా సెక్యూరిటీ చర్యలు చేపట్టారు . మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 31 వేల మంది పోలీసులు, 65 కంపెనీల కేం ద్ర బలగాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు . ఇప్పటికే ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహిస్తూ నాఖాబందీలతో అక్రమ డబ్బుకు అడ్డుకట్ట వేస్తున్నారు . మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.13.83కోట్లు పట్టుకోగా, మూడు కమిషనరేట్ల పరిధిలో రూ.9.76 కోట్ల నగదు సీజ్ చేశారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్….

ఈ కమిషనరేట్ పరిధిలోని 15 అసెంబ్లీస్థానాలతో పాటు సికిం ద్రాబాద్, హైదరాబాద్ తో పాటు మల్కాజిగిరి, చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్లు వస్తాయి. ఇప్పటి కే సిబ్బందికి ట్రైనిం గ్ పూర్తి చేశారు. సివిల్,ఆర్డ్మ్ పోలీసులకు సమస్యాత్మక ప్రాంతాలు,ఈవీఎం సెంటర్లు, స్ట్రాం గ్ రూమ్స్, పోలింగ్ రోజు భద్రతపై ట్రైనింగ్ ఇచ్చారు . హైదరాబాద్,సికిం ద్రాబాద్ లోక్ సభ స్థా నాలు పూర్తిగా వచ్చే కమిషనరేట్ పరిధి బందోబస్తుకు 13వేల మంది స్థానిక పోలీసులు, 20 కంపెనీల కేంద్ర బలగాలను కేటాయించారు. ఇందులో 14 కంపెనీల కేంద్ర బలగాలు ఇప్పటి కే సిటీకి చేరాయి. ఏసీపీ స్థాయి అధికారి అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ గా 45 స్పెషల్ స్టైకింగ్ టీమ్స్,45 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ తో తనిఖీలు చేస్తున్నారు . మంగళవారం వరకు 32 కేసుల్లో రూ.4.79కోట్ల నగదును పట్టుకొ ని,135 లీటర్ల లిక్కర్ ను సీజ్ చేశారు. షాడో టీమ్‌ లతో నిఘా సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్ సభ స్థా నాలతో పాటు మల్కాజిగిరి, చేవెళ్లలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. దీంతో నాలుగు లోక్ సభ స్థానాల్లో 1,602 ప్రాంతాల్లో 4,020 పోలిం గ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు . ఇందులో 1,340 పోలింగ్ స్టేషన్లు 440 క్రిటికల్ లొకేషన్స్ లో ఉన్నాయి. సిటీలో 14 డీఆర్సీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి కే 5,409 మందిని బైండోవర్ చేశారు. 4,609 లైసెన్స్‌‌‌‌డ్‌‌‌‌ ఆయుధాలను డిపాజిట్ చేసుకున్నారు. పెండింగ్ లో ఉన్న 845 నాన్ బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేసి 8482 పిటీ కేసులు నమోదు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మరో 37 కేసులు బుక్‌‌‌‌ చేశారు. ఎన్నికల ప్రచారాలు,ర్యాలీలు, సభలను వీడియో రికార్డింగ్ చేస్తూ అభ్యర్థుల వెంట షాడో టీమ్ లతో నిఘా పెట్టారు . ఓల్డ్‌ ‌‌‌సిటీతో పాటు సిటీలో13 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ స్థానిక డీసీపీ, ఏసీపీ స్థా యి అధికారులతో సెక్యూరిటీపై సమీక్షిస్తూ సీసీ కెమెరాలతో నిఘా పెంచారు.

సైబరాబాద్ పోలీస్ కమిషరేట్….

ఈ కమిషనరేట్ పరిధిలోని లోక్ సభ స్థానాల పరిధిలో10వేల మంది సివిల్, 2,000 మంది ఆర్మ్‌‌‌‌డ్‌‌‌‌ ఫోర్సెస్ తో భద్రత కట్టుది ట్టం చేశారు. 25 కంపెనీల కేంద్ర బలగాలను బందోబస్తుకు కేటాయించారు. ఇప్పటి కే 12 కంపెనీల బలగాలకు సైబరాబాద్ చేరాయి. ఈ కమిషనరేట్ పరిధిలో 1102 లొకేషన్లలో 2,868 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుం డగా, వీటిలో 214 ప్రాంతాల్లోని 74 క్రిటికల్ గా గుర్తిం చారు. 256 మంది రూట్ ఆఫీసర్లతో పర్యవేక్షిస్తున్నారు . 6 డీఆర్సీ సెంటర్ల వద్ద కేంద్ర బలగాలు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు. కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి14 చెక్ పోస్ట్ లు పెట్టి 20 ఫ్లైయిం గ్ స్క్వాడ్స్,24 ఎస్.ఎస్.టీ టీమ్స్ తో తనిఖీలు చేస్తున్నారు.

కమాండ్‌ కంట్రోల్‌‌‌‌ రూమ్‌ కు కనెక్ట్‌…
ఇప్పటి వరకు 585 కేసుల్లో 1,807 మందిని బైండోవర్ చేశారు. 1085 లైసెన్స్‌‌‌‌డ్‌‌‌‌ ఆయుధాలను డిపాజిట్ చేసుకున్నారు . 40 ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహిం చారు. మంగళవారం వరకు వాహన తనిఖీల్లో 9 కేసుల్లో రూ.9.83 లక్షలను పట్టుకున్నారు . మరో 12 కేసుల్లో 320 లీటర్ల లిక్కర్ ను సీజ్ చేశారు. పెండిం గ్ లో ఉన్న 514 నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేశారు. 5 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కేసులను నమోదు చేశారు. పోలిం గ్ స్టేషన్లకు జియో ట్యాగింగ్ చేసి సీసీ కెమెరాలను కమాం డ్ కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ చేశారు.

రాచకొండ పోలీసు కమిషనరేట్‌…

‌‌‌హైదరాబాద్,సైబరాబాద్ తో పాటు రాచకొండ పోలీసు కమిషనరేట్ 5 లోక్ సభస్థానాల్లో విస్తరించి ఉంది. ఇందులో మల్కాజిగిరి, భువనగిరిలతో పాటు చేవెళ్ల, నల్లగొండ, సికింద్రాబాద్ పాక్షికంగా వస్తాయి. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా కమిషనరేట్ పరిధిలో1,521 ప్రాంతాల్లో3,215 పోలిం గ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 137 ప్రాంతాల్లో 358 స్టేషన్లు క్రిటికల్ గా గుర్తించారు. 274 మంది రూట్ ఆఫీసర్లను నియమించి భద్రతపై ఫోకస్ చేశారు. 6,000 మంది స్థానిక పోలీసులు, 25 కేంద్ర బలగాలను కేటాంచారు. ఇప్పటికే 11 సెంట్రల్ ఫోర్సె స్ గస్తీ కాస్తున్నాయి. 6 డీఆర్సీ సెంటర్ల వద్ద పారామిలిటరీతో సెక్యూరిటీని పెట్టారు.

Latest Updates