దేశంలోనే తొలిసారిగా రూ. 10 కోట్లతో మోడ్రన్​ బస్​ టెర్మినల్

ఎట్టకేలకు వనస్థలిపురంలో నిర్మాణం

దేశంలోనే తొలి ఏసీ బస్ టెర్మినల్

ఎల్​బీనగర్ లో తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ

హైదరాబాద్​, వెలుగు:  రాష్ర్ట ప్రభుత్వం ఎట్టకేలకు వనస్థలిపురంలో మోడ్రన్​ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి నిర్ణయించింది.  దీన్ని రూ. 10 కోట్లతో హెచ్ఎండీఏ నిర్మించనుండగా , దేశంలోనే తొలి ఏసీ బస్ టెర్మినల్ కానుంది. హరిణ వనస్థలి నేషనల్ పార్కు వద్ద నిర్మిస్తారు.  రెండు దశల్లో  పనులు చేపట్టనుండగా, నాలుగు లైన్లలో ఐదు బస్ బేలు ఉంటాయి.  దీని పనులు పూర్తయి అందుబాటులోకి వస్తే  నల్గొండ, ఖమ్మం, ఏపీ, తమిళనాడు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.

ఆరు నెలల్లో..

ఎల్‌బీ నగర్‌ మీదుగా ఏపీతో పాటు తెలంగాణలోని ఖమ్మం, భద్రాచలం, నల్లగొండ, సూర్యాపేటకు రోజూ సుమారు 20 వేల నుంచి 25 వేల మంది ప్రయాణికులు వెళ్తుంటారు. ఇక్కడ బస్సులు రోడ్డుపై ఆగి విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది.  దీంతో సుమారు 900 మీటర్ల వరకు అధునాతన బస్‌ బేలను నిర్మించడానికి హెచ్ఎండీఏ ప్లాన్ చేసింది. దీంతో ఇక్కడి బస్టాండ్‌ను తొలగించి ఆటోనగర్‌ సమీపంలోని క్రిడా వద్ద బస్‌ టెర్మినల్‌ నిర్మిస్తుంచనున్నారు.  వ్యయంతో ఏసీ బస్‌బేల నిర్మాణంతో పాటు  సోలార్‌ ప్లాంట్, డ్రైనేజీ, ప్రయాణికులకు  వసతులు కల్పించనున్నారు.  వైఫై, నీటిశుద్ధి కేంద్రం, పార్కింగ్‌ వసతి, ఏటీఎం కేంద్రాలు, ఫుడ్ కోర్టులు, షాపింగ్ కు అనువుగా నిర్మించనున్నారు.  ఆరు నెలల్లో నిర్మాణ పనులు పూర్తవుతాయని హెచ్ఎండీఏ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్నికలకంటే ముందే నిర్మించాలనుకున్నా..

జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందే బస్‌ టెర్మినల్ నిర్మించాలని భావించినా, డిజైన్  మార్పులతో వాయిదా పడింది. అయితే ఇటీవల ఆ ప్రతిపాదనలకు తుది రూపనిచ్చిన అధికారులు మంత్రి కేటీఆర్ తో  పనులు ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఈ ఆధునిక బస్ టెర్మినల్ కు శనివారం మధ్యాహ్నం 1 గంటకు మంత్రి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. అయితే ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఎల్​బీ నగర్ జంక్షన్ నుంచి సిటీ లోకి వచ్చే ఇంటర్ సిటీ
బస్సుల రద్దీ తగ్గుతుంది. దీంతో సిటీలో వెహికల్ ట్రాఫిక్ కంట్రోల్​ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్లు అమ్మినా.. కిరాయికి ఇచ్చినా పట్టా రద్దు

అది నా బెస్ట్‌.. అందుకే వీడియో మళ్లీ మళ్లీ చూస్తున్నా..

ఫ్రెండ్ షిప్ పేరుతో ట్రాప్‌‌‌‌‌‌‌‌.. గిఫ్ట్‌లు తెచ్చామంటూ మోసాలు

హోమ్‌‌ లోన్లపై ఎస్‌‌బీఐ గుడ్‌‌న్యూస్


Latest Updates