ఒకే ఒక్కడు : ఫోర్బ్స్ లిస్ట్‌‌లో అక్షయ్ కుమార్

ముంబై: ఫోర్బ్స్ విడుదల చేసిన వరల్డ్ హైయ్యస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ 2019  లిస్ట్‌‌లో  ఒకే ఒక్క ఇండియన్‌‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నిలిచారు. అక్షయ్ కుమార్ ఈ లిస్ట్‌‌లో 31వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. టైలర్ స్విఫ్ట్ 185 మిలియన్ డాలర్లతో(రూ.1265 కోట్లతో) ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు. అక్షయ్ కుమార్ ‘బాలీవుడ్ టాప్ ఎర్నింగ్ స్టార్‌‌‌‌’గా ఫోర్బ్స్ మేగజైన్ తెలిపింది. ఒక్కో సినిమాకు అక్షయ్ రూ.35 కోట్ల నుంచి రూ.70 కోట్లు ఆర్జిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్..  జగన్ శక్తి డైరెక్ట్ చేసే మిషన్ మంగళ్, ఫర్హద్ సమ్జీకి చెందిన హౌస్‌‌ఫుల్ 4, రాజ్‌‌ మెహతా ఫిల్మ్ గుడ్ న్యూస్, రాఘవా లారెన్స్ దర్శకత్వం వహించే లక్ష్మి బాంబ్, రోహిత్ శెట్టి సూర్యవంశీ చిత్రాల్లో నటిస్తున్నారు.

అక్షయ్ కుమార్ సంపాదనలో ఆయన బ్రాండ్ ఎండార్స్‌‌మెంట్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన 20 కి పైగా టాప్ బ్రాండ్స్‌‌ను ఎండార్స్ చేసుకుని ఉన్నారు. 2018 జూన్ నుంచి 2019 జూన్​ వరకు అక్షయ్ కుమార్ మొత్తం సంపాదన రూ.444కోట్లుగా ఉంది. అక్షయ్ కుమార్ పలువురు ఇంటర్నేషనల్ ఏ–లిస్టర్స్‌‌ను దాటేసి కూడా ముందుకు వచ్చారు. అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళ్ స్వతంత్ర దినోత్సవం రోజు థియేటర్లలోకి రాబోతుంది.