టాప్ టెన్ హయ్యస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ లిస్ట్‌ విడుదల.. ఇండియా నుంచి ఒకే ఒక్కడు..

ప్రముఖ గ్లోబల్ మీడియా కంపెనీ ఫోర్బ్స్ వరల్డ్స్ హయ్యస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ లిస్ట్‌ను తాజాగా ప్రకటించింది. గతేడాది జూన్ 1, 2019 నుంచి ఈ ఏడాది జూన్ 1, 2020 వరకు ఆయా వ్యక్తులు సంపాదించిన ఆదాయాన్ని బట్టి ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. ఫోర్బ్స్ లిస్ట్‌లో 87.5 మిలియన్స్‌ సంపాదనతో హాలీవుడ్ యాక్టర్ డ్వేన్ జాన్సన్ టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. జుమాంజీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వంటి హిట్ చిత్రాలలో నటించిన డ్వేన్ జాన్సన్.. అడ్వర్టైజ్ మెంట్ కోసం చేసే ఇన్‌స్టాగ్రాం పోస్టు ద్వారా దాదాపు రూ. 7.5 కోట్లు సంపాదిస్తున్నాడు. ఈయనకు ఇన్‌స్టాగ్రాంలో 189 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2019 ఫోర్బ్స్ లిస్టులో కూడా జాన్సన్ మొదటి ప్లేస్ సొంతం చేసుకున్నాడు.

నెట్ ఫ్లిక్స్ లో విడులయిన ‘సిక్స్ అండర్ గ్రౌండ్’, ‘రెడ్ నోటీస్’ సినిమాలలో నటించిన ర్యాన్ రేనాల్డ్స్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. అతని ఈ ఏడాది సంపాదన 71.5 మిలియన్ డాలర్లు.

ఎన్నో సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మార్క్ వాల్ బర్గ్ ఫోర్బ్స్ జాబితాలో మూడో స్థానాన్ని పొందాడు. ఈయన ప్రొడ్యూసర్ గా ‘మెక్ మిలన్స్’ మరియు ‘వాల్ స్ట్రీట్’ సినిమాలకు సంబంధించి ఎన్నో సిరీస్ లు వచ్చాయి. జాబితాలో 58 మిలయన్ డాలర్లతో మూడో ప్లేస్ లో నిలిచాడు.

నటుడు, దర్శకుడు అయిన బెన్ అఫ్లెక్ 2020 లో 55 మిలియన్ డాలర్ల సంపాదనతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. ‘ద లాస్ట్ థింగ్ హీ వాంటెడ్’, ‘ద వే బ్యాక్’ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సీరిస్ లలో ఒక హీరో అయిన విన్ డీజిల్ 2020లో 54 మిలియన్ డాలర్ల సంపాదనతో అయిదో ప్లేస్ లో ఉన్నాడు. విన్ డీజిల్ కు ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

ఈ జాబితాలో ఇండియా నుంచి కేవలం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. 48.5 మిలియన్ డాలర్ల ఆదాయంతో యాక్షన్ స్టార్ ఈ లిస్ట్‌లో టాప్ 6 పొజిషన్‌లో నిలిచాడు. హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్స్‌లో వరల్డ్‌లో ఆరో స్థానంలో నిలిచిన అక్షయ్.. రీసెంట్‌గా పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.25 కోట్లు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కరోనాపై అవగాహన కోసం ఓ షార్ట్‌ఫిల్మ్‌ను కూడా రూపొందించాడు.

లిన్-మాన్యువల్ మిరాండా మొదటిసారి ‘హామిల్టన్’నాటకంలో కనిపించారు. ఈ నాటకం యొక్క హక్కులను డిస్నీ ఎక్కువ మొత్తంతో కొనుగోలు చేసింది. దానిని సీరీస్ ల రూపంలో డిస్నీ ప్లస్‌లో ప్రసారం చేస్తున్నారు. మిరాండా ప్రస్తుతం “ఇన్ ది హైట్స్” అనే సినిమాలో నటిస్తున్నారు. మిరాండా ఈ సంవత్సరం 45.5 మిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో ఉన్నాడు.

హాస్యనటుడు, నటుడు మరియు సంగీతకారుడు అయిన విల్ స్మిత్ 2020 ఫోర్బ్స్ లిస్టులో 44.5 మిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. స్మిత్ కు ఫోర్బ్స్ ర్యాంకింగ్‌కు కొత్తేమీ కాదు. స్మిత్ తన స్నాప్‌చాట్ సిరీస్ లతో మళ్లీ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

ఆడమ్ సాండ్లర్ యొక్క ప్రజాదరణ ఇటీవలి సంవత్సరాలలో తగ్గినప్పటికీ.. అతని ఆదాయాలు మాత్రం తగ్గలేదు. కానీ.. జాబితాలోని ఇతరుల మాదిరిగా ఎక్కువగా సంపాదించలేదు. సాండ్లర్ సొంత చిత్రం ‘అన్కట్ జెమ్స్’ అతనికి పెద్ద మొత్తంలో లాభించలేదు. సాండ్లర్ 2014లో 250 మిలియన్ డాలర్లకు నాలుగు చిత్రాలు చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. అప్పటినుంచి సాండ్లర్ నెట్‌ఫ్లిక్స్ లో విజయవంతమయ్యాడు. అతని నెక్ట్స్ మూవీ ‘మర్డర్ మిస్టరీ’ ఈ సంవత్సరం స్ట్రీమర్‌లో ప్రాచుర్యం పొందింది. ఫోర్బ్స్ లిస్టులో సాండ్లర్ 41 మిలియన్ డాలర్ల సంపాదనతో తొమ్మిదో ప్లేస్ లో ఉన్నాడు.

జాకీచాన్.. ప్రపంచంలో ఈ పేరు తెలియని సినీ అభిమానులుండరు. ఈయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినా.. తన క్రేజ్ ను మాత్రం తగ్గకుండా.. ఫోర్బ్స్ లిస్టులో స్థానాన్ని సంపాదించాడు. ప్రస్తుతం జాకీచాన్ సంపాదన 40 మిలియన్ డాలర్లుగా ఉంది. దాంతో టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నాడు.

For More News..

ఆవు వెంటబడి తరిమితే.. హెలికాప్టర్‌‌తో కాపాడిన్రు

Latest Updates