విదేశీయులు మన దేశానికి రావచ్చు. కండిష‌న్స్ అప్ల‌య్..

కొన్ని కేటగీరిల్లో మాత్రమే అవకాశం కల్పిస్తూ హోంశాఖ ఆర్డర్స్

న్యూఢిల్లీ : ఫారెనర్స్ మనదేశానికి వచ్చేందుకు హోంశాఖ అవకాశం కల్పించింది. లాక్ డౌన్ కారణంగా ఇంటర్నేషనల్ ట్రావెల్స్ పూర్తిగా బంద్ పెట్టిన కేంద్రం తాజాగా కొన్ని కేటగీరిల్లో విదేశీయుల ప్రయాణానికి ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి ఆర్డర్ ను హోంశాఖ రిలీజ్​ చేసింది. వ్యాపారులు, హెల్త్ ప్రొఫెషనల్స్, ఇంజనీర్లు, ఫారెన్ కంపెనీలకు సంబంధించిన వారు అంటూ పలు కేటగిరీలుగా డివైడ్ చేసింది. వీరంతా మనదేశానికి వచ్చేందుకు ఫ్రెష్ గా వీసా పొందాలని కండిషన్ పెట్టింది. ఇంతకుముందు ఏడాది పాటు, ఆరు నెలల పాటు బిజినెస్ వీసా తీసుకున్నప్పటికీ అది చెల్లదని క్లారిటీ ఇచ్చింది. కొత్తగా వీసా అప్లయ్ చేసుకోవాల్సిందేనని తెలిపింది.

 వీళ్లకు పర్మిషన్లు ఇస్తారు

ఫారెన్ బిజినెస్ పర్సన్స్ రావొచ్చు. ఒక్క స్పోర్ట్స్ కోసం ఉద్దేశించిన బీ 3 వీసా మినహాయించి మిగతా బిజినెస్ వీసాలపై ఫారెనర్స్ మనదేశంలో ప్రయాణం చేయవచ్చు. నాన్ షెడ్యుల్ కమర్షియల్, ఛార్టెడ్ ప్లైట్స్ కూడా దేశంలోకి వచ్చేందుకు అనుమతి ఇస్తారు. హెల్త్ ప్రొఫెషన్ లో ఉన్న వారందరికీ అవకాశం. హెల్త్ ప్రొఫెషనల్స్, రీసెర్చ్ స్కాలర్స్, ఇంజనీర్లు, టెక్నీషియన్స్, లాబొరేటరీస్, హెల్త్ ఫ్యాక్టరీస్ కు అవసరమైన టెక్నీషియన్స్, ఫారెన్ ఇంజనీర్స్, మేనేజర్లు, డిజైనర్లు, మనదేశంలోని ఫారెన్ బిజినెస్ సంస్థలకు సంబంధించిన విదేశీయులు, ఫారెన్ టెక్నికల్ స్పెషలిస్ట్ లు, ఇన్ స్టాలేషన్ ఇంజనీర్స్, ఫారెన్ మెషీన్స్ రిపేర్, మెయింటెనెన్స్ కోసం వచ్చే వారు, ఇండియన్ బిజినెస్ సంస్థల ఇన్విటేషన్ ఉన్న ఫారెనర్స్ కు అనుమతి ఇస్తారు.

Foreign businessmen, engineers, healthcare professionals can get visas to enter India

Latest Updates