ఐపీఎల్ ఫస్ట్ వీక్ కు ఫారిన్ క్రికెటర్లు మిస్

యూఏఈకి లేటుగా రానున్నఆసీస్, ఇంగ్లండ్ క్రికెటర్లు

ఇరు జట్ల మధ్య సిరీసే కారణం

ఐపీఎల్ ఫస్ట్ వీక్ మిస్సవనున్న ఆసీస్ క్రికెటర్లు

డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ (సన్ రైజర్స్), ఆరోన్ ఫించ్, జోష్ ఫిలిప్ , కేన్ రిచర్డ్ సన్ (బెంగళూరు), పాట్ కమిన్స్​(నైట్ రైడర్స్​), మ్యాక్స్వెల్ (పంజా బ్), స్టీవ్ స్మిత్, ఆండ్రూ టై (రాయల్స్​), అలెక్స్క్యారీ, స్టో యినిస్(ఢిల్లీ), హాజిల్ వుడ్ (చెన్నై).

 న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) 13వ సీజన్ తొలి వారం చప్పగా సాగే అవకాశం కనిపిస్తోంది. ధనాధన్ లీగ్ కు మెయిన్ అట్రాక్షన్ అయిన ఫారిన్ క్రికెటర్లు .. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లు తొలి వారంలో జరిగే మ్యాచ్ లకు అందుబాటులో ఉండడం లేదు. ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ టూర్ కన్ఫామ్ కావడమే ఇందుకు కారణం. ఈ సీజన్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19న మొదలవుతుంది.

మరోపక్క ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20లు, 3 వన్డేల సిరీస్ సెప్టెంబర్ 4న మొదలై16న ముగుస్తుంది. అయితే, బీసీసీఐ ఫ్రాంచైజీలకు ఇచ్చిన స్టాండర్డ్​ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ప్లేయర్లు, సపోర్ట్​ స్టాఫ్ ఎవరైనా సరే యూఏఈ చేరిన వెంటనే కరోనా టెస్ట్​లు చేయించుకోవాలి. నెగెటివ్ రిజల్ట్స్ రావడంతోపాటు ఏడు రోజుల క్వారంటైన్ పూర్తి అయిన తర్వాతే జట్టుతో కలిసేందుకు అనుమతిస్తారు. దీంతో ఇంగ్లండ్ , ఆసీస్ క్రికెటర్లు సెప్టెంబర్ 26 తర్వాతే బరిలోకి దిగనున్నారు. రెండు దేశాలకు చెందిన 29 మంది ప్లేయర్లకు ఐపీఎల్ కాంట్రాక్టులున్నాయి. వారిలో డేవిడ్‌‌ వార్నర్, బెన్‌‌ స్టోక్స్, పాట్ కమిన్స్‌‌, జోఫ్రా ఆర్చర్ వంటి స్టార్లున్నారు.

ఆసీస్ జట్టు ఇంగ్లండ్ టూర్ కారణంగా ముంబై ఇండియన్స్ తప్ప అన్ని ఫ్రాంచైజీలు ప్రభావితం కానున్నాయి. నేథన్ కూల్టర్ నైల్, క్రిస్ లిన్ ముంబై టీమ్ లో ఉన్నారు. అయితే, ఇంగ్లండ్ సిరీస్ కు క్రికెట్  ఆస్ట్రేలియా(సీఏ) ఎంపిక చేసిన 21 మంది జట్టు లో వీరు లేకపోవడం ముంబైకి ప్లస్ అయ్యింది. ఇంగ్లండ్ కూడా తమ జట్టు ను ప్రకటిస్తే ఎవరెవరు యూఏఈకి ఆలస్యంగా వస్తారనే దానిపై మరింత క్లారిటీ వస్తుంది.

Latest Updates