హత్రాస్ బాధితురాలిపై రేప్ జరగలేదు.. కులాల్ని రెచ్చగొట్టేందుకే..

లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్‌‌‌‌కు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్‌‌లోని విషయాలను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ టెస్ట్ ప్రకారం బాధితురాలిపై రేప్ జరగలేదని యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్ అన్నారు. ‘ఫోరెన్సిక్ రిపోర్టులో ఎలాంటి సెమన్ (వీర్యం) ఆనవాళ్లు లభించలేదు. అమ్మాయిపై రేప్ జరగలేదని ఎఫ్‌‌ఎస్‌‌ఎల్ రిపోర్ట్ ఇప్పటికే తెలిపింది. తప్పుడు సమాచారంతో కులాల మధ్య ఘర్షణలు సృష్టించాలని, రెచ్చగొట్టాలని కుట్ర పన్నినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది’ అని ప్రశాంత్ పేర్కొన్నారు. గురువారం అందిన ఓ తాజా వీడియో ప్రకారం బాధితురాలి గొంతును నులపలేదని తెలుస్తోందన్నారు.

Latest Updates