సమ్మెకు దిగనున్న వడ్రంగి కార్మికులు

వడ్రంగి కార్మికులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులకు నిరసనగా గ్రేటర్ సిటీ టీంబర్స్ మార్చంట్స్ , సామిల్లర్ల్స్ అసోసియేషన్ ఆందోళనకు పిలుపునిచ్చింది. బేగం బజార్ లోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడు రమణయ్య మాట్లాడుతూ ఈనెల 11 నుండి మూడురోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీంబర్స్ డిపోలు మూసివేసి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు తెలిపారు.

జీవో నెం 55 వల్ల పోలీసులు, ఫారెస్ట్ అధికారుల వేధింపులు అధికామయ్యాయని వారు అన్నారు. కర్రకోత మిషన్లను లైసెన్స్ నుండి మినహాయించి, వడ్రంగులకు, వ్యవసాయదారులకు సహకరించాలని వారు కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలందిస్తున్న వడ్రంగులు ఉపయోగించే కర్ర కోత, దుగోడ విషన్ లను అటవీశాఖ అధికారులు సీజ్ చెయ్యడం వల్ల వరంగల్ జిల్లాలో ఓ వడ్రంగి ఆత్మహత్యకు పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు . ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో 55ను వెంటనే రద్దు చేసి టీంబర్ పరిశ్రమను ఆదుకోవాలని వారు కోరారు.

 

Latest Updates