3 చెట్లు నరికిన యజమానికి రూ. 39 వేల ఫైన్

forest-officers-imposed-rs-39000-fine-on-owner-for-cutting-3-trees

హైదరాబాద్ : ఓ ఇంటి యజమానికి అటవీశాఖ అధికారులు షాక్ ఇచ్చారు. అపార్ట్ మెంట్ నిర్మిస్తున్న యజమాని..తన ఇంటికి అడ్డుపడుతున్నాయని.. మూడు చెట్లను నరికివేశాడు. అయితే.. అనుమతి లేకుండా చెట్లు నరికిన యజమానికి అధికారులు భారీ జరిమానా విధించారు. హైదరాబాద్‌ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా తెలిసింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో ఓ ఇంటి యజమాని అటవీ అధికారుల అనుమతి లేకుండా మూడు చెట్లు నరికాడు.

దీనిపై సీరియస్ అయిన అధికారులు ఆ యజమానికి రూ.39060లు ఫైన్ విధించారు. గత నెల 7న ఆ యజమానికి ఫైన్ విధించగా.. ఈ నెల 9న అమౌంట్ మొత్తాన్ని చెల్లించాడు. సిటీలో చెట్ల పెంపకానికి సంబంధించి GHMCతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయని.. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇందుకోసం సర్కార్ నిధులు వెచ్చిస్తుందని తెలిపిన అధికారులు..అనుమతి లేకుండా చెట్లు నరికితే పైన్ తప్పదన్నారు.

Latest Updates