మా తండ్రిని చంపిన వారిని క్షమిస్తున్నాం

  • ప్రకటించిన జమాల్ ఖషోగి కుమారులు

రియాద్: హత్యకు గురైన సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగి కొడుకులు తమ తండ్రిని చంపిన వారిని క్షమిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ‘‘మా తండ్రిని చంపిన వారిని క్షమించమని ప్రకటించాము’’ అని  ఖషోగి కుమారుడు సలా ఖషోగి ట్విట్టర్ లో తెలిపారు. అయితే, దీనికి సంబంధించిన చట్టపరమైన అంశాల గురించి వెల్లడించలేదు. సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్ లో కథనాలు రాసిన ఖషోగి.. టర్కీ ఇస్తాంబుల్​లోని సౌదీ ఎంబసీలో 2018 అక్టోబర్ లో హత్యకు గురయ్యారు. ఈ మర్డర్ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. దాదాపు అన్ని దేశాలు స్పందించాయి. ఈ కేసులో సౌదీ ప్రిన్స్ హస్తం ఉన్నట్లు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఖషోగి మర్డర్ కేసులో దోషులెవరన్న దానిపై అమెరికా గూడాచార సంస్థను రంగంలోకి దింపింది. ఈ కేసులో రియాద్ కు చెందిన 15 మంది ఏజెంట్లు పాల్గొన్నారని టర్కీ ఆరోపించింది. ఎన్నో పరిణామాల తర్వాత ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన సౌదీ .. ఎనిమిది మందికి శిక్ష ఖరారు చేసింది. ఐదుగురికి మరణశిక్ష, ముగ్గురికి 24 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. మొదట్లో సౌదీ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ప్రకటించిన ఖషోగి కుమారులు.. మరోవైపు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసులో శిక్ష పడినవారిని క్షమిస్తున్నట్లు ప్రకటించారు.

Latest Updates