మరింత విషమంగా అసోం మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ ఆరోగ్యం మరింత విషమించింది. ఇటీవల కరోనా వైరస్ బారినపడి కోలుకున్న ఆయనకు అనారోగ్య సమస్యలు వెంటాడటంతో గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు గువాహటి మెడికల్‌ కాలేజ్‌ సూపరింటెండెంట్‌ అభిజీత్‌ శర్మ తెలిపారు.

తరుణ్‌ శరీరంలోని పలు అవయవాల పనితీరు క్షీణించడంతో శనివారం సాయంత్రం ఆయనను గువాహటి మెడికల్‌ కాలేజీలో చేర్చారు. ఇక శ‌నివారంతో పోలిస్తే గొగొయి ఆరోగ్యం ఆదివారం కాస్త మెరుగుపడిందని అభిజిత్‌ పేర్కొన్నారు. కాగా అక్టోబర్‌లో అయాసం రావడంతో గువాహటి మెడికల్‌ కాలేజీకి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆ తరువాత జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక ప్లాస్మా థెరపీ చేయడంతో ఆయన కోలుకోగా.. గత నెల 25న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే పలు అవయవాల పనితీరు క్షీణించడంతో మరోసారి ఆయనను శనివారం ఆసుపత్రిలో చేర్చారు

Latest Updates